ED Investigation On NTV Chowdary : జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ భూ లావాదేవీల్లో మనీలాండరింగ్ పై ఈడీ దర్యాప్తు చేసింది. అనంతరం అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ఈడీ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటెడ్ ప్రస్తుత అధ్యక్షుడితోపాటు ఎన్టీవీ వ్యవస్థాపకుడు టీ. నరేంద్రచౌదరితోపాటు ఇతరులు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపినట్టు సమాచారం. అలాగే దీనిపై సమాచారం అందించాలని సొసైటీని ఆదేశించింది.
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కు ప్లాట్లు కేటాయించిన వ్యక్తుల వివరాలు, సొసైటీ ఆస్తుల వివరాలు, స్వాధీనం చేసుకున్న విధానం.. ప్రభుత్వ ఆస్తులు, వాటితోపాటు వెనక్కి తీసుకున్న వివరాలను ఈడీ కోరింది. సొసైటీ , కంపెనీలకు కేటాయించిన ఆస్తి వివరాలను కూడా కోరింది.
వచ్చే నెల 7న ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎన్టీ చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున వందలాది కోట్లు స్వాహా చేసినట్టు ఎన్టీవీ చౌదరిపై వచ్చిన ఆరోపణలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..
