Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా కూడా అలరిస్తున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున మాత్రం ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం ఆనందంలో ఉన్నారనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ, అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు… మంచి విజయం సాధించగా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఎక్కువగా బైక్ రైడింగ్ సీన్లు ఉంటాయని… ఆ సినిమాలో డూప్ లేకుండా తానే సొంతంగా బైక్ నడిపానని నాగార్జున చెప్పారు. 80, 90 స్పీడ్ లో బైక్ నడిపానని… కానీ ఆ సీన్లు ఇప్పుడు చూస్తుంటే తనకు ఆశ్చర్యం కలుగుతుందని నాగార్జున అన్నారు. అయితే డూప్ లేకుండా బైక్ రైడింగ్ సీన్లు చేయడం చాలా ప్రమాదకరమని నాగార్జున చెప్పారు. అలానే అఖిల్, నాగచైతన్య ఒక వేళ అలాంటి సీన్లలో నటిస్తానంటే తాను ఒప్పుకోనని నాగ్ తేల్చి చెప్పారు.
తనను కూడా అలాంటి సీన్లలో నటించమని ఎవరైనా అడిగితే తాను నటించనని చెప్పేస్తానని నాగార్జున తెలిపారు. ఇక నాగార్జున ప్రస్తుతం ” ది ఘోస్ట్ ” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా.. .అమలపాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు “బంగార్రాజు” చిత్రంలో కూడా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతుకీ జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nagarjuna shocking comments about bike riding scenes in movies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com