
Hyderabad Divorce Cases: మూడు ముళ్లు విడిపోతున్నాయి.. ఏడడగులు తడబడుతున్నాయి. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభిస్తున్న జంటలు మూన్నాలకే విడిపోతామంటున్నాయి. అగ్ని సాక్షిగా కలకాలం తోడుంటామని ప్రమాణం చేసిన జంటలు.. కొంత కాలమైనా కలిసి ఉండలేమని దూరమవుతున్నాయి. కనిపించని ఆ అరుంధతినే వేళెత్తి చూసుకున్న ఆ జంటలే.. ఇప్పుడు ఒకరి తప్పులను మరొకరు వెళెత్తి చూపిస్తున్నారు. కష్టమైనా, సుఖమైన కడదాక కలిసుంటామని పురోహితుల మంత్రోఛ్చారణల మధ్య ఏకమైన జంటలు.. చిన్న చిన్న మనస్పర్థలకే విడిపోతామంటున్నాయి.
ఏటా పెరుగుతున్న విడాకుల కేసులు..
కొన్ని పెళ్లి అయిన జంటలు జీవితాంతం కలిసి ఉండలేకపోతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కోర్టు మెట్లు ఎక్కేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఏటా విడాకుల తీసుకునే వారి సంఖ్య, విడాకుల కోసం కోర్టుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.
హైదరాబాదులోనే ఎక్కువ..
తమకు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతున్న వారిలో హైదరాబాదు వాసులే ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల వచ్చిన గణంకాలు వీటిని రుజువు చేస్తున్నాయి. హైదరాబాదులో ఉన్న 10 ఫ్యామిలీ కోర్టుల్లో రోజుకు 50-60 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 25-35 ఏళ్ల మధ్యన ఉన్నవారు 75 శాతం మంది ఉంటున్నారట. 10 కోర్టుల్లో రోజుకు 5 నుంచి 6 కేసులు నమోదు అవుతున్నాయి.
కారణాలేంటి ?
హైదరాబాదులోనే విడాకుల కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ఉరుగుల పరుగుల జీవితంలో దంపతులు ఒకరికి ఒకరు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఎక్కువ శాతం జంటల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు ఉంటున్నారు. దీంతో వారి కలిసి ఉండే సమయం తగ్గిపోతోంది. షిఫ్టుల వారీగా జాబ్ చేసే వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. ఇద్దరి మధ్య దూరం పెరగిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. కొన్ని సార్లు ఆఫీసు నుంచి వచ్చినా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుండటంతో తమ భాగస్వామితో కలిసి కబుర్లు చెప్పుకోలేకపోతున్నారు. కొన్ని సార్లు ఇంటికి వచ్చినా.. ఆఫీసు పని మీదే ఉండటం, కనీస సరదాలు లేకపోవడం వంటివన్నీ కూడా కారణాలు. ఆర్థిక సమస్యలు, భర్త మద్యానికి బానిసవడం, వివేహేతర సంబంధాలు, అదనపు కట్నం, దంపతులు మధ్య ఇరు కుటుంబాల అనవసర జోక్యం వంటివి విడాకులకు కారణమౌతున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
నివారణకు ఏం చేయాలి ? సామాజికవేత్తలు ఏం చెబుతున్నారు ?
భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతలను ఒకరితో మరొకరు పంచుకోవాలి. ఎంత బిజీగా ఉన్న ఒకరికొకరు సమయం కల్పించుకోవాలి. జంటల మధ్యలో మనస్పర్థలు వచ్చినప్పుడు అనవసరంగా ఇరు కుంటుబాల సభ్యులు కలుగజేసుకోకూడదు. ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకోవాలి. దంపతులు ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండాలి. పిల్లల పెంపకంలో ఇద్దరూ బాధ్యత తీసుకోవాలి. ఒకరి మధ్య ఒకరికి దాపరికాలు లేకుండా చూసుకోవాలి. తమ జీవిత భాగస్వామిపై బంధువుల ముందు, స్నేహితుల ముందు జోక్స్ వేయకూడదు. వారి ముందు హేళనగా మాట్లాడకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటిస్తే దంపతులు కలకాలం కలిసి ఉంటారని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.
Also Read: సమంత ఎందుకు విడాకులు తీసుకుందో సంచలన నిజం చెప్పిన మాధవీలత.. వైరల్