Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: నాగార్జున చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదే...

Nagarjuna: నాగార్జున చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదే…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువసామ్రాట్ నాగార్జున కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గతంలో ఆయన డిఫరెంట్ కథలతో సినిమాలను చేశాడు. ముఖ్యంగా 1993 వ సంవత్సరంలో చేసిన ‘రక్షణ’ సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో ఒక గొప్ప పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జీవిత ఖైదీ శిక్ష ను అనుభవించే రౌడీలు సైతం రాజకీయ పార్టీ అండదండలు ఉంటే సత్ప్రవర్తన కింద జైలు నుంచి రిలీజ్ అవ్వచ్చు అంటూ అప్పట్లో […]

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువసామ్రాట్ నాగార్జున కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గతంలో ఆయన డిఫరెంట్ కథలతో సినిమాలను చేశాడు. ముఖ్యంగా 1993 వ సంవత్సరంలో చేసిన ‘రక్షణ’ సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో ఒక గొప్ప పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జీవిత ఖైదీ శిక్ష ను అనుభవించే రౌడీలు సైతం రాజకీయ పార్టీ అండదండలు ఉంటే సత్ప్రవర్తన కింద జైలు నుంచి రిలీజ్ అవ్వచ్చు అంటూ అప్పట్లో ఈ సినిమాలో వచ్చిన సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా క్రైమ్ చేసి ఎలా తప్పించుకోవచ్చు అనేది కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మొత్తానికైతే పోలీసులు రాజకీయ నాయకులు కలిస్తే ఏదైనా సాధ్యమే అనే రీతిలో కూడా ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం… ఇక అప్పట్లోనే రాజకీయ నాయకులకు చుట్టాలుగా మారిన చట్టాలు ఇప్పుడు కూడా అదే ధోరణిలో వాళ్లకి హెల్ప్ చేస్తూనే ఉన్నాయి. సామాన్య మానవుడు మాత్రమే చట్టాల్లో ఇరుక్కుపోయి శిక్షలను అనుభవిస్తున్నాడు. రాజకీయ నాయకులకు డబ్బున్న వాళ్లకు ఎలాంటి చట్టాలు వర్తించటం లేదనేది వాస్తవం… రక్షణ సినిమా కథను అక్కినేని నాగార్జున వాళ్ళ అన్నయ్య అయిన వెంకట్ అలాగే ఈ సినిమా దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాసుకున్నారు… అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని వెంకట్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో నాగార్జున సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మన హీరోలు చేసిన సినిమాల లిస్టు తీస్తే ఈ సినిమా మొదటి స్థానంలో ఉండేది. మరి అలాంటి నాగార్జున ఈ సినిమాలో తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తించడమే కాకుండా తప్పు చేసిన రౌడీ మూకలకు ఎలా సమాధానం చెప్పాడు.

యావజీవకారాగర శిక్షను అనుభవించే నల్ల శీను రాజకీయ నాయకుల అండదండతో సత్ప్రవర్తన కింద బయటికి వచ్చినా కూడా వాడు చేసే ఆకృత్యాలను నాగార్జున ఎలా ప్రూవ్ చేశాడు. మళ్ళీ అతన్ని ఎలా జైలుకు పంపించాడు అనేది ఈ సినిమా స్టోరీ… నాగార్జున పక్కన శోభన అద్భుతంగా నటించి మెప్పించింది. ఒక సాంగ్ లో రోజా ఆడి పాడటం విశేషం… నాజర్ నాగార్జునకు స్నేహితుడిగా నటించాడు. మొత్తానికైతే ఈ సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.

అలాంటి ఒక సినిమా ఇప్పుడు ఉన్న జనరేషన్లో కొంతమంది హీరోలకు పడితే బాగుంటుందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే అయితే వ్యక్తమవుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper