Nagarjuna : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ఎవరు ఏ భాషలో సినిమా చేసిన కూడా ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని చూస్తూ దాన్ని జడ్జ్ చేస్తున్నాడు. ఒక సినిమా బాగుంటే బాగుందని ప్రమోట్ చేస్తున్నారు. ఒకవేళ బాలేకపోతే మాత్రం ఆ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇకమీదట సినిమాలను చేసే మేకర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : నాగార్జున 100 వ సినిమా దర్శకుల లిస్ట్ ఇదేనా..? ఎవరు ఫైనల్ అయ్యారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కింగ్ నాగార్జున (Nagarjuna) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. కమర్షియల్ సినిమాలే కాకుండా పౌరాణికానికి సంబంధించిన సినిమాలను చేయడంలో కూడా ఆయనకు చాలా మంచి పేరు అయితే ఉంది. అన్నమయ్య(Annamayy), శ్రీ రామదాసు (Sri Ramadasu) లాంటి సినిమాలతో ఎనలేని గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకున్న ఆయన ఇప్పుడు మాత్రం తన సత్తాను చాటుకోవడంలో కొంతవరకు వెనకబడి పోతున్నాడు. తన తోటి హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లు మంచి సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తుంటే ఆయన మాత్రం చేసిన సినిమాలన్నింటితో ప్లాప్ లను మూటగట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన సక్సెస్ అయితే రాలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వచ్చే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక తను వందో సినిమా చేయాల్సి ఉన్నప్పటికి లోకేష్ కనకరాజు నుంచి ఆఫర్ రావడంతో ఆయన డైరెక్షన్ లో రజనీకాంత్ (Rajinkanth) హీరోగా వస్తున్న కూలీ (Cooli) సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. అందులో బ్యాక్ షాట్ ఒకటి హైలెట్ గా నిలిచింది.
రజినీకాంత్ కనిపించి విజిల్ వేసినప్పటికి ఆయన కంటే ఎక్కువ క్రేజ్ ను నాగార్జున సంపాదించుకున్నాడనే చెప్పాలి. నాగార్జున ముఖం కనిపించినప్పటికి బ్యాక్ షాట్ నుంచి నాగార్జునను ఎలివేట్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.
Also Read : రకుల్ ప్రీత్ సింగ్ టార్చర్ తట్టుకోలేక నాగార్జున అలాంటి పని చేశాడా!
ఇక ఈ సినిమాలో నాగార్జున చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపించబోతున్నాడు అనేది ఒక చిన్న షాట్ ద్వారా ఎలివేట్ చేశారు. మరి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఈ చిన్న షాట్ తోనే అక్కినేని అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అక్కినేని అభిమానుల్లో జోష్ వచ్చింది.
అటు నాగార్జున(Nagarjun) , ఇటు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil) చేసిన సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్లు ఎప్పటికప్పుడు నిరాశ చెందుతూనే వస్తున్నారు. కానీ కూలీ (Cooli) సినిమాతో వాళ్ల నిరీక్షణ కి బ్రేక్ పడనుందని ఈ మూవీ భారీ సక్సెస్ సాధించడమే కాకుండా నాగార్జున క్యారెక్టర్ భారీగా ఎలివేట్ అయ్యే విధంగా కనిపిస్తుందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…