Heroes : ఒకప్పుడు నార్త్ సినిమా, సౌత్ సినిమా అంటూ సినిమాల మధ్య వేరియేషన్స్ అయితే ఉండేవి. కానీ బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఇప్పుడు నార్త్, సౌత్ అని కాకుండా మంచి సినిమా, చెడ్డ సినిమా అనే రెండు సినిమాలు మాత్రమే ఇండియాలో ఉన్నాయి అంటూ చాలామంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఏ హీరో అయినా కూడా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఎంతమంది ఎన్ని సక్సెస్ లను సాధించినా కూడా ఒక హీరో ఇమేజ్ ను మాత్రం ఎవ్వరు టచ్ చేయలేరు అంటూ కొంతమంది వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి ఇంతకీ ఎవరా ఆ హీరో అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రజినీకాంత్ (Rajinikanth)… ఆయన తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన రోబో (Robo), రోబో (Robo 2) సినిమాలు సైతం సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి.
Also Read : ఇండియన్ ఇండస్ట్రీ లో టాప్ 5 హీరోస్ వాళ్లేనా..? అందులో మనవాళ్ళు ఉన్నారా..?
కాబట్టి ఇప్పుడు ఎంతమంది స్టార్ హీరోలు వచ్చిన కూడా ఆయన ఇమేజ్ ను టచ్ చేయలేరు అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తుండడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraj) డైరెక్షన్ లో చేస్తున్న కూలీ (Cooli) సినిమాతో మరోసారి 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడతాడు.
ఇప్పుడున్న యంగ్ హీరోలకు పోటీని ఇస్తాడు అంటూ తన అభిమానులు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో ఆయన ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు, ఎలాంటి పర్ఫామెన్స్ ని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు.
మరి లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కాబట్టి మేకింగ్ పరంగా కూడా ఈ సినిమా చాప గ్రాండ్ గా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తోంది. మరి రజనీకాంత్ ఇమేజ్ ను పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందా? మరోసారి తనను తాను సూపర్ స్టార్ గా ఎలివేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఆ హీరోలకు రెమ్యునరేషన్ భారీ గా ఉంది..కానీ హిట్టు కొట్టలేకపోతున్నారు..?