Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చిన హీరోలు తమ సత్తా చాటుతూ ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోలుగా ఎదుగుతున్నారు. ఇక స్టార్ హీరో రేస్ లో వాళ్లే ముందు వరుసలో ఉంటున్నారు. ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి కూడా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగేశ్వరరావు స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తన కొడుకు అయిన నాగార్జున సైతం టాప్ ఫోర్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు…
Also Read: ఐపీఎల్ లో నాలుగు సెంచరీలు..ఇందులో చాలా అద్భుతాలు, సంచలనాలు.. అవి ఏంటంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక తమతోటి హీరోలు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తుంటే వీళ్ళు మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీలు గా చెప్పుకుంటున్న వాళ్ళ నుంచి ఒక్క అక్కినేని ఫ్యామిలీలో తప్ప మిగతా ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరైనా స్టార్ హీరోగా ఎదిగారు. మరి వీళ్ళు ఎందుకని నెగ్లెట్ చేస్తున్నారు. మంచి కథలను ఎంచుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్లతో ఎందుకు సినిమాలు చేయడం లేదు. వాళ్లతో సినిమాలు చేసినప్పటికి ఎందుకు సక్సెస్ లు రావడం లేదు అనే ప్రశ్నలు వాళ్ళ అభిమానుల గుండెలను కలిచివేస్తున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే నాగార్జున (Nagarjuna) తన వందో సినిమాతో ఇండస్ట్రీలో ఒక మంచి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తన వందో సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. కనీసం ఈ సినిమాతో అయినా భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అని ఒక డైలమాలో అక్కినేని అభిమానులైతే ఉన్నారు.
ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నాగార్జున వందో సినిమా చేస్తున్నాడా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారింది. ఇక ఈయన వందో సినిమా లిస్ట్ లో రోజుకోక డైరెక్టర్ పేరు వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు వెంకీ అట్లూరి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఇంతకుముందు లోకేష్ కనకరాజు, శేఖర్ కమ్ముల, కళ్యాణ్ కృష్ణ లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు కొత్తగా వెంకీ అట్లూరి కూడా ఈ లిస్టులో చేరిపోయాడు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఇండస్ట్రీలో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం నాగార్జున తన వందో సినిమాని ఎవరితో చేస్తున్నాడు అనేది క్లారిటీగా తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది… తొందర్లో నాగార్జున తన వందో సినిమాకు సంబంధించిన అప్డేట్ ను చెప్పకపోతే మాత్రం అక్కినేని అభిమానులు తీవ్రమైన నిరాశను చెందే అవకాశాలైతే ఉన్నాయి…