Nagarjuna: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) డైట్ విషయం లో ఎంత జాగ్రత్తలు పాటిస్తాడో మన అందరికీ తెలిసిందే. ఆరు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ ఆయన ఇంత అందంగా కనిపిస్తున్నదంటే అందుకు కారణం ఆయన అనుసరించే స్ట్రిక్ట్ డైట్ అని అందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన డైట్ తీసుకోవడం కంటే ఎక్కువగా వర్కౌట్స్ తూచా తప్పకుండ ప్రతీరోజు చేస్తూ ఉంటాడు. నాగార్జున కి ట్రైనింగ్ ఇచ్చే జిమ్ ట్రైనర్ ని అనేక మంది యంగ్ హీరోలు అడిగిమరీ తమకు కూడా జిమ్ ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు, నాగార్జున తన వర్కౌట్స్ తో మిగిలిన హీరోలలో తాము కూడా అలా వర్కౌట్స్ చేయాలి అనే కాసిని పెంచాడు అనేది. ఇకపోతే డైట్ విషయం లో నాగార్జున స్ట్రిక్ట్ గానే ఉంటాడు కానీ, మనం అనుకునేంత స్ట్రిక్ట్ అయితే కాదు అని కచ్చితంగా చెప్పొచ్చు.
Also Read: ఓదెల 2′ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు కూడా రాలేదు!
గతంలో నాగార్జున ‘మన్మథుడు 2’ అనే చిత్రం చేశాడు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో ఆమెకు ఉన్న లిప్ లాక్ సన్నివేశం అప్పట్లో పెద్ద వివాదాలకు దారి తీసింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెన్నెల కిషోర్ నాగార్జున అనుసరించే డైట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘షూటింగ్ ప్రారంభమైన కొత్తల్లో నాగార్జున గారితో కలిసి నేను, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవిచంద్రన్ డిన్నర్ కి వెళ్తూ ఉండేవాళ్ళం. రకుల్ ప్రీత్ సింగ్ డైట్ విషయం లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఇది కేవలం పావు కేజీ మాత్రమే తీసుకోవాలి, ఇది కేవలం 300 గ్రాములు మాత్రమే ఉండాలి అని తినేటప్పుడు చెప్పేది. నాగార్జున గారు ఆమెని భరించలేక ఆ తదుపరి రోజు నుండి రకుల్ ని డిన్నర్ కి కట్ చేసాడు’.
‘ఇక ఆ తర్వాత నేను నాగార్జున గారు, రాహుల్ రవిచంద్రన్ కలిసి డిన్నర్ కి వెళ్తుండేవాళ్ళం. రాహుల్ నాన్ వెజ్ తినడు అనే విషయాన్ని తెలుసుకొని అతన్ని కూడా కట్ చేసాడు. ఇక చివరికి నేను ఒక్కడినే మిగిలాను. నేను, నాగార్జున గారు మాత్రమే షూటింగ్ పూర్తి అయ్యేవరకు డిన్నర్ కి వెళ్తూ ఉండేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్. దీనిని బట్టి అర్థం చేసుకోవాలంటే వయస్సుతో సంబంధం లేకుండా నాగార్జున రేంజ్ లుక్స్ ని మైంటైన్ చేయాలంటే, కేవలం డైటింగ్ తీసుకుంటే సరిపోదు, అంతకు మించిన వర్కౌట్స్ ప్రతీ రోజు చెయ్యాలి అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక పోతే నాగార్జున ప్రస్తుతం ‘కూలీ’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. కూలీ చిత్రం ఆగస్టు 14 న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Also Read: గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్‌లో స్పేస్‌ఎక్స్ ఆఫర్.. అమెరికా క్షిపణి రక్షణ కల..!