Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో బాలకృష్ణ (Balakrishna)…తన తండ్రి అయిన ‘నందమూరి తారక రామారావు’ గారి నటవరసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ డాన్సులు, ఫైట్లు చేస్తూ సినిమా చూసే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించ గలుగుతాడు. అందుకే ఆయన ప్రయోగాత్మకమైన సినిమాలను సైతం చేస్తూ ఉంటాడు. కెరియర్ స్టార్టింగ్ లో భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని తనలోని నటన ప్రతిభను బయటకు తీశాడు. మొత్తానికైతే బాలయ్య బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు చాలామంది దర్శకులతో పనిచేశాడు వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఇచ్చాడు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
కానీ ఒక్క ఆ దర్శకుడు కి మాత్రం ఆయన సరైన లైఫ్ నైతే ఇవ్వలేకపోయాడు. ఇంతకు అతనేవరు అంటే డిఫరెంట్ సినిమాలను చేస్తూ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)… బాలయ్య బాబు వందో సినిమా అయిన గౌతమీపుత్ర శాతకర్ణి (Gouthami Putra Shathakarni) సినిమాను క్రిష్ (Krish) డైరెక్షన్లో చేశాడు.
ఇక ఈ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆ తర్వాత బాలయ్య తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ని చేయాలనే ఉద్దేశ్యంతో కథా నాయకుడు (Katha Nayakudu), మహానాయకుడు (Maha Nayakudu) అనే రెండు సినిమాలు చేశాడు. ఈ సినిమాకి కూడా క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలు భారీ డిజాస్టర్ ని ముట్టుగట్టుకోవడంతో ఒక్కసారిగా క్రిష్ కెరియర్ అయితే డైలమాలో పడిపోయింది…
అప్పటినుంచి ఇప్పటివరకు తను కోలుకోవడం లేదు. దాంతో మరోసారి బాలయ్య క్రిష్ ను పిలిచి అతనికి ఇంకొక అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను రూపొందిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.