Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకు విలువ లేదు.. కేవలం సెలబ్రిటీలకు మాత్రమే విలువ అనేది నిన్నటి ఎపిసోడ్ తో మరోసారి రుజువు అయ్యింది. సామాన్యులు ఇక మీ విలువైన అమ్యాన్ని వృధా చేసుకోకండి , అగ్ని పరీక్ష లాంటి షోస్ కి రాకండి , వచ్చినా మీకు విలువ ఉండదు , మీ పరువు మొత్తం తీసి బయటకు పంపిస్తారు అనేందుకు ఉదాహరణగా నిల్చింది నిన్నటి నాగార్జున హోస్టింగ్. ఒక వ్యక్తిని అనరాని మాటలు అంటే, అందుకు రెడ్ కార్డు వార్నింగ్ ఇచ్చి బయటకు పంపాల్సింది పోయి , సుతి మెత్తగా మందలిస్తూ స్కూల్ పిల్లలకు ఇచ్చే శిక్ష ఇవ్వడం ఏంటో , టీ కప్పులు కడగానోడికి అరగంటసేపు క్లాస్ పీకడం ఏంటో అసలు అర్థం కావడం లేదు. సామాన్యుడు కాబట్టి రోహిత్ ని మెంటల్ టార్చర్ చేయడమే లక్ష్యంగా బిగ్ బాస్ టీం టార్గెట్ పెట్టుకుందా అనే సందేహాలు ఇప్పుడు నెటిజెన్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఇంతే.. త్రిగున్ లాగా యావర్ పై గౌతమ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నాగార్జున గంటసేపు క్లాస్ పీకాడు. అదే విధంగా గత సీజన్ లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో పై ట్రోల్స్ , జోక్స్ వేసినందుకు అభయ్ కి రెడ్ కార్డు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఈ సీజన్ లో త్రిగున్ అనే వ్యక్తి పై రెండు చేసాడు, అయినప్పటికీ కూడా అతనికి స్కూల్ పిల్లల శిక్ష విధించాడు. ఇదేమి హోస్టింగ్ నాగార్జున?, పక్క రాష్ట్రాల్లో బిగ్ బాస్ హోస్టులు రఫ్ఫాడిస్తున్నారు , ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా వాళ్ళ హోస్టింగ్ ఉంటుంది, మరి నీది?, తప్పు చేసిన వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నట్టుగానే ఉంది, ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అంతే కాదు ఆడియన్స్ ఓటింగ్ కి అసలు ఏ మాత్రం విలువ లేదని మరోసారి స్పష్టమైంది. మంచి ఓటింగ్ ఉన్న చరణ్ ని మూడవ రోజే ఎలిమినేట్ చేశారు , అదే విధంగా డేంజర్ జోన్ లో లేని చైత్ర ని కూడా ఎలిమినేట్ చేశారు , కానీ అందరికంటే తక్కువ ఓటింగ్ ని నమోదు చేసుకున్న సుధీర్ రెడ్డి , కృష్ణుడు లను మాత్రం సేవ్ చేశారు. రేపు ఎలాంటి ఎలిమినేషన్ లేదట. కృష్ణుడు , సుధీర్ రెడ్డి ఇద్దరు హై రిస్క్ లో జోన్ లో పెట్టారట. అంటే వీళ్ళని కూడా వచ్చే వారం ఎదో ఒక టాస్క్ నిర్వహించి దాని ఫలితం ఆధారంగా ఎలిమినేట్ చేయడమో , లేదంటే హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడమో జరుగుతుంది. వచ్చే వారం కూడా ఆడియన్స్ ఓటింగ్ లో చివరి రెండు స్థానాల్లో ఉన్నవాళ్ళని మరోసారి హై రిస్క్ జోన్ లో పెట్టి ఇదే ప్రక్రియ ని కొనసాగిస్తారు.
కాబట్టి ఈ సీజన్ లో ఆడియన్స్ ఓటింగ్ కి ఎలాంటి ప్రాముఖ్యత లేదు , కేవలం కంటెస్టెంట్స్ చేతుల్లో మాత్రమే…అయ్యో , క్షమించండి సెలబ్రిటీల చేతుల్లో మాత్రమే ఎలిమినేషన్స్ ఉంటాయి. అంటే ఎదో ఒక వారం రోహిత్ టాస్క్ బాగా ఆడకపోయి, హై రిస్క్ జోన్ లో ఉంటే అతన్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 10 ప్రక్రియ స్పష్టంగా కళ్ల ముందు కనిపించేస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నిన్న సెలబ్రిటీలు మొత్తం రోహిత్ పై తమకు ఉన్న కసి మొత్తాన్ని తీర్చుకున్నట్టుగా అనిపించింది. త్రిగున్ అందరి బుర్రలను మ్యానిప్యులేట్ చేయడం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా రోహిత్ అందరినీ మ్యానిప్యులేట్ చేస్తున్నట్టుగా చిత్రీకరించి చూపిస్తున్నారు. దీన్ని బట్టీ షో ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే నెమ్మదిగా త్రిగున్ ఇప్పుడు అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ బుర్రలను కూడా మ్యానిప్యులేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఝాన్సీ ని తమ వైపుకు లాగేసుకున్నాడు. ఇప్పుడు అమన్ బుర్రని కూడా మ్యానిప్యులేట్ చేసాడు. అమన్ రోహిత్ ని టార్గెట్ చేసేందుకు సరైన కారణం కోసం ఎదురు చూస్తున్నాడు , ఎదో ఒకరోజు కచ్చితంగా ఇతను రోహిత్ కి యాంటీ గా మారుతాడు అనేది అర్థం అవుతోంది. ఇక రోహిత్ వెంట ఉన్నది శ్రేష్టి , షాలిని మాత్రమే. వీళ్ళు అయినా రోహిత్ కి తోడుగా ఉంటారా?, లేదంటే వీళ్ళు కూడా రోహిత్ ని వదిలేస్తారా?, సెలబ్రిటీల చేతుల్లోనే గేమ్ మొత్తం ఉన్నప్పుడు , ఈ పద్మవ్యూహం లో రోహిత్ ఎన్ని వారాలు నెగ్గుకు రాగలడో అనుమానమే. ఒకవేళ వీళ్లందరినీ ఎదురుకొని బిగ్ బాస్ సీజన్ 10 టైటిల్ విన్నర్ గా నిలిస్తే మాత్రమే , రోహిత్ పేరు హిస్టరీ లో ఎప్పటికీ అలా నిలిచిపోతుంది అనుకోవచ్చు. నిన్నటి ఎపిసోడ్ లో టీ కప్పులు కచ్చితంగా కడగాలి అనే రూల్ లేకపోయినా కూడా అనవసరంగా అందరూ అతన్ని టార్గెట్ చేసి , అతని గ్రాఫ్ ని పాతాళంలోకి తొక్కే ప్రయత్నం చేశారు. కానీ ఇది రోహిత్ కి చాలా పెద్ద పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడియన్స్ లో ఆయనపై సానుభూతి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఇక అతన్ని అందుకోవడం చాలా కష్టం , ఇంతకు ముందు 50 శాతం ఓటింగ్ ఉండేది , ఇప్పుడు అది 80 శాతం కి చేరింది. బిగ్ బాస్ హిస్టరీ లోనే మొదటి వారం లో విన్నర్ డిసైడ్ అయిపోవడం ఇదే తొలిసారి అనుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రోహిత్ ఇదే రేంజ్ గ్రాఫ్ ని మైంటైన్ చేస్తాడా?, లేదా మధ్యలో డౌన్ అవుతుందా అనేది. నిన్నటి ఎపిసోడ్ మీకెలా అనిపించింది?, నాగార్జున హోస్టింగ్ పై మీ అభిప్రాయం ఏంటి?, నిర్మొహమాటం గా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.