Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదెక్కడి న్యాయం...

Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదెక్కడి న్యాయం నాగార్జున!

Bigg Boss 10 Telugu: గత మూడు బిగ్ బాస్ సీజన్స్ నుండి గమనిస్తే అక్కినేని నాగార్జున హోస్టింగ్ చాలా బయాస్ గా అనిపిస్తోంది. ఆయనకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తున్నారో , లేదంటే తన సొంత అభిప్రాయాలను చెప్తున్నాడో తెలియదు కానీ , ఆయన హోస్టింగ్ ముమ్మాటికీ పరమ చెత్తగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున అభిమానులకు కూడా ఆయన హోస్టింగ్ అసలు నచ్చడం లేదు. దీని వెనుక బిగ్ బాస్ […]

Bigg Boss 10 Telugu: గత మూడు బిగ్ బాస్ సీజన్స్ నుండి గమనిస్తే అక్కినేని నాగార్జున హోస్టింగ్ చాలా బయాస్ గా అనిపిస్తోంది. ఆయనకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తున్నారో , లేదంటే తన సొంత అభిప్రాయాలను చెప్తున్నాడో తెలియదు కానీ , ఆయన హోస్టింగ్ ముమ్మాటికీ పరమ చెత్తగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున అభిమానులకు కూడా ఆయన హోస్టింగ్ అసలు నచ్చడం లేదు. దీని వెనుక బిగ్ బాస్ టీం స్ట్రాటజీ ఏదైనా ఉందా?, అనవసరంగా చెత్త స్క్రిప్ట్స్ ఇచ్చి నాగార్జున ని జనాల్లో నెగిటివ్ చేస్తున్నారా?, అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశ్యం అంటూ సోషల్ మీడియా విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో త్రిగున్ ఈ వారం మొత్తం చేసిన ఎమోషనల్ టార్చర్ కి గట్టి క్లాస్ పడుద్ది అని అంతా అనుకున్నారు.

క్లాస్ పడింది , కానీ త్రిగున్ కి కాదు..రోహిత్ కి..ఎందుకంటే టీ కప్పులు కడగనందుకు అట. అదే విధంగా తనకు గ్లాస్ నీళ్లు ఇచ్చి , ఎవరో ఒక కంటెస్టెంట్ ముఖం పై చల్లమని ఇచ్చిన టాస్క్ పూర్తి చేయలేదట, బిగ్ బాస్ రూల్స్ పాటించకపోతే ఇంటి నుండి వెళ్ళిపో అనే రేంజ్ లో కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి త్రిగున్ కూడా నాగార్జున ఇచ్చిన ఘోస్ట్ టాస్క్ ని పూర్తి చెయ్యలేదే ?, దీని పై ఎందుకు ప్రశ్నించలేదు?, తన లాగానే త్రిగున్ కూడా సెలబ్రిటీ కాబట్టి , వివక్ష చూపించాడా? అంటే కచ్చితంగా అవుననే అంటున్నారు విశ్లేషకులు. త్రిగున్ ఒక మనిషిని టార్గెట్ చేస్తూ , అనరాని మాటలు అన్నాడు , కానీ అతన్ని మాత్రం బుజ్జగించి , తప్పు అమ్మా , అలాంటి మాటలు మాట్లాడకూడదు , ఇలా మాట్లాడినందుకు నీకు స్కూల్ పిల్లలకు ఇచ్చే శిక్ష ఇస్తాను , బయటకి వెళ్లి టైర్ ఆట ఆడుకోపో అన్నాడు అంతే.

ఆ టైర్ ఆట కూడా కేవలం పది నిమిషాలు మాత్రమే ఆడించాడు , ఎందుకంటే సెలబ్రిటీలు ఎండలో అంతసేపు తిరిగితే మాసిపోతారు కదా, ఒక తోటి సెలబ్రిటీ గా తట్టుకోలేక నాగార్జున అలా చేశాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , రామ్ ప్రసాద్ ఒక ఆడపిల్ల పై అత్యంత నీచమైన జోకు వేస్తే , అతనికి ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా?, షాలిని కి క్షమాపణలు చెప్తూ 500 సార్లు రాయాలట. అది కూడా ఎక్కువగా కష్టపెట్టడం ఇష్టం లేక , మధ్యలోనే ఆపించేసాడు మన నాగార్జున సారూ అంటూ సోషల్ మీడియా సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. కానీ రోహిత్ మాత్రం ఎంగిలి కప్పులన్నీ కడగలట , అది కడిగించి బాధ్యత షాలిని ది అట. ఇదెక్కడి న్యాయం నాగార్జున సారూ అంటూ సోషల్ మీడియా లో రివ్యూయర్స్ ఏకిపారేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper