Naga Vamsi : ప్రముఖ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) పేరు సోషల్ మీడియా లో నిత్యం ట్రెండ్ లోనే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు, వేసే సెటైర్లు యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేని సినిమాకి కూడా నాగవంశీ తన ప్రొమోషన్స్ తో ఆ చిత్రం అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తాడు. అదే ఆయనలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్. నాగవంశీ మాటలని చూసి అందరూ ఆయన్ని చింటూ అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే రేపు ప్రపంచవ్యాప్తంగా సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరో గా నటించిన ‘జాక్- కొంచెం క్రాక్'(Jack – Konchem Krack) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి ఒక అతిథి గా నాగవంశీ పాల్గొని, తన మార్క్ స్పీచ్ ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : నా సినిమాలు చూడకండి..బ్యాన్ చేయండి – నిర్మాత నాగ వంశీ
ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయన గురించి నాగవంశీ మాట్లాడుతూ ‘సార్ మీ బొమ్మరిల్లు ని చూసి చాలా మంది ప్రభావితమయ్యారని ఇందాక ఒకరు ఇక్కడ మాట్లాడారు. అలా ప్రభావితమైన వారిలో మేము కూడా ఉన్నాము. మీ సినిమా చూసిన తర్వాతనే మా చెల్లికి హాసిని అనే పేరు పెట్టాము. ఆరోజుల్లో నేను బొమ్మరిల్లు ఇంటర్వెల్ సన్నివేశాన్ని థియేటర్స్ లో వెయ్యి సార్లు చూసి ఉంటాను,అంత నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. హీరో సిద్దు గురించి మాట్లాడుతూ ‘సిద్దు సినిమా అంటే కామెడీ టైమింగ్, హీరోయిన్ టీజింగ్ చేయడం వంటివి ఆడియన్స్ ఆశిస్తారు. జాక్ ట్రైలర్ చివరి షాట్ మీరంతా చూసే ఉంటారు. అలాంటి షాట్స్ సినిమాలో మినిమం పది ఉంటాయి. ట్రైలర్ ని చూసి ఇదేదో యాక్షన్ ఎంటర్టైనర్ అని పొరపాటు పడకండి. సినిమాకి వచ్చి రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వుకుంటారు’.
‘మా మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని చూసి రెండు వారాలు నవ్వుకున్నారు, జాక్ చిత్రాన్ని చూసి ఇంకో రెండు వారాలు నవ్వుకోవాలి. వైష్ణవి చైతన్య ని చాలా పద్దతిగా ఈ సినిమాలో చూపించారు. కానీ మా సినిమాలో అలా చూపించట్లేదు. చాలా బోల్డ్ గా చూపిస్తున్నాము. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బూతులన్నీ ఆమెతో మాట్లాడించాము. చాలా చెడ్డగా వైష్ణవి ని మా సినిమాలో చూపించబోతున్నాము. ఈ సినిమాని నేను ఇంకా చూడలేదు కానీ, ఎడిటర్ నవీన్ గారు చూసారు. ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడంటే కచ్చితం గా ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయినట్టే. నిర్మాత ప్రసాద్ గారికి విరూపాక్ష చిత్రం తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సినిమా పై అంచనాలను క్రియేట్ అయ్యేలా చేసింది. చూడాలి మరి ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ పై మండిపడ్డ నిర్మాత నాగవంశీ..మా సినిమాలో కథ లేదంటూ షాకింగ్ కామెంట్స్!