Naga Vamsi : ఉగాది కానుకగా మన టాలీవుడ్ నుండి విడుదలైన సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి, ఉగాది విజేత గా నిల్చిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie). మొదటి నుండి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత కూడా వాళ్ళ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అవ్వడంతో భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. నిర్మాత నాగవంశీ(Nagavamsi) లెక్కల ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నాడు. ఈ సందర్భంగా నేడు ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రివ్యూయర్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ నాగవంశీ లో రివ్యూస్ విషయంపై ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : తారక్ ఫ్యాన్స్ చేసిన ఆ పనికి దిగొచ్చిన నిర్మాత…
ముందుగా ఆయన మాట్లాడుతూ ‘చిన్న సినిమా అయినప్పటికీ టికెట్ రేట్స్ ఎందుకు పెంచారని కొంతమంది అంటున్నారు. ఒకే రోజున రెండు మూడు సినిమాలు విడుదల అవుతుండడం వల్ల మేము బయ్యర్స్ ని దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్స్ పెంచాల్సి వచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే మా సినిమా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బయ్యర్స్ లాభాల్లోకి వచ్చేసారు. ఈరోజు నుండి మేము టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము. పదవ తరగతి పరీక్షలు అయిపోయాయి. పిల్లలందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాని చూసేందుకు అనుకువగా ఉండే విధంగా టికెట్ రేట్స్ పెడుతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్లపై ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కాంట్రవర్సిగా మారే నాగ వంశీ వ్యాఖ్యలు, ఈసారి ఇంకా కాస్త మోతాదు పెంచాడు.
ఆయన మాట్లాడుతూ ‘రెండు సినిమాలు విడుదలైనప్పుడు, ఒక సినిమా అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఆందుకే మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఆడుతుంది అని కొంతమంది అంటున్నారు. అవతల సినిమా బాగాలేదు కాబట్టి కోర్ట్ చిత్రం ఆడలేదు, కోర్ట్ బాగుంది కాబట్టే ఆడింది. ఇప్పుడు మా సినిమా కూడా బాగుంది కాబట్టే ఆడుతుంది. సీక్వెల్ కాబట్టే ఆడుతుంది, స్టోరీ లేదు అని కొంతమంది కామెంట్స్ చేయడం కూడా నా దృష్టికి వచ్చింది. ఇదేమైనా బాహుబలి, కేజీఎఫ్ సీక్వెల్స్ అనుకుంటున్నారా?, చిన్న సినిమా బాగలేకపోతే ఎవరు చూస్తారు?, రివ్యూస్ ఎలాగో పాజిటివ్ గా ఇవ్వరు, కనీసం సినిమా బాగా ఆడుతున్నప్పుడు కూడా ప్రోత్సహించరా?, మా మీద అంత పగ ఉంటే మా సినిమాలకు రివ్యూస్ ఇవ్వడం ఆపేయండి, మా సినిమాలను పూర్తిగా బ్యాన్ చేయండి, ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేను చూసుకుంటా, మేము సినిమాలు తీయబట్టే, మేము మీకు యాడ్స్ ఇవ్వబట్టే మీకు వెబ్ సైట్స్ నడుస్తున్నాయి. మా సినిమాలు బాగా ఆడితేనే మీకు వ్యాపారం, కాబట్టి సినిమాలను చంపకండి’ అంటూ ఆయన మాట్లాడాడు. ఇంకా ఏమేమి మాట్లాడాడో ఈ ఇంటర్వ్యూ లో చూడండి.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ డైరెక్టర్ పై మండిపడ్డ నిర్మాత నాగవంశీ..మా సినిమాలో కథ లేదంటూ షాకింగ్ కామెంట్స్!
mah mentaloduuuuu ♀️ @vamsi84 pic.twitter.com/vN4qFuDPzg
— appie (@fizz_nandamuri) April 1, 2025