Nagavamsi : సమ్మర్ లో విడుదల కాబోతున్న సినిమాల్లో యూత్ ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి మ్యాడ్ స్క్వేర్(MAD Square). 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆ సినిమాలో నటించిన నటీనటులే ఇందులో కూడా ఉన్నారు, కానీ హీరోయిన్స్ మాత్రం ఉండరట. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం నిమిషం నిడివి లోనే పొట్టచెక్కలు అయ్యే డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చే ‘భాయ్’ డైలాగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన నెటిజెన్స్ మీమ్స్ లో ఆ డైలాగ్ ని వాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని కాసేపటి క్రితమే ఏర్పాటు చేసారు.
నిర్మాత సూర్య దేవర నాగవంశీ(Suryadevara Nagavamsi), డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) తో పాటు, సినిమాలో నటించిన ముగ్గురు హీరోలు, మిగిలిన టెక్నీషియన్స్ కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా పార్ట్ 1 కంటే భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో క్రిందపడి దొర్లాడి నవ్వుకుంటారు’ అని చెప్పుకొచ్చాడు. అప్పుడు వెంటనే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘నేను కళ్యాణ్ కి ఎన్నోసార్లు చెప్పా, స్టేజి మీద బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ లాంటి పదాలు వాడొద్దు అని, సినిమా విడుదల సూపర్ హిట్ అయ్యాక మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు ఇప్పుడే అవన్నీ, ఒకవేళ తేడా అయితే మమ్మల్ని ఏమి అనరు, అతన్ని ఘోరంగా వేసుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా సినిమాలో కథ ఉండదు. దయచేసి కథని ఆశించి మా సినిమాకి రాకండి. మ్యాడ్ చిత్రం ఎలా అయితే సూపర్ ఫన్ గా ఉంటుందో, ఈ సినిమా కూడా అదే విధంగా ఉంటుంది. ముగ్గురు ఇంజనీరింగ్ చదువుకొని చెడిపోయిన వెదవలు, మంచోడు పెళ్ళికి వచ్చి గోవాకి తీసుకెళ్లి వాడిని కూడా చెడగొట్టేస్తారు. సినిమా మొత్తం ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. మొన్ననే నేను ఫస్ట్ హాఫ్ చూసాను, సాధారణంగా నేను అంత పెద్దగా నవ్వను. అలాంటి నేనే క్రిందపడి దొర్లాడి మరీ నవ్వాను. సెకండ్ హాఫ్ ఇంకా నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని నాతో చెప్పారు. ఫస్ట్ హాఫ్ కే కామెడీ ఆ రేంజ్ లో ఉందంటే, ఇక సెకండ్ హాఫ్ లో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుంది మీరే ఊహించుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.