Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉండొచ్చు, రాబోయే రోజుల్లో ఆయన పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్స్ మళ్లీ మళ్లీ రావొచ్చు, కానీ ‘ఆర్య’ లాంటి కల్ట్ క్లాసిక్ చిత్రం మాత్రం మళ్లీ ఆయన కెరీర్ లోకి రావడం చాలా కష్టం. ఇలాంటి మ్యాజిక్స్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ చిత్రం తోనే సుకుమార్ మన టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. దిల్ రాజు కి, అల్లు అర్జున్ కి ఇది రెండవ చిత్రం. కమర్షియల్ గా అప్పట్లోనే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరోజుల్లో చిరంజీవి మేనల్లుడు అదరగొట్టేసాడు అంటూ మాట్లాడుకునేవాళ్ళు. ఇంత మందికి లైఫ్ ఇచ్చిన ఈ చిత్రం, మరో నిర్మాతకు కూడా భవిష్యత్తుని చూపించింది.
ఆ నిర్మాత మరెవరో కాదు, బన్నీ వాసు(Bunny Vasu). అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుల్లో ఈయన ఒకరు. కష్టసుఖాల్లో తోడు ఉంటూ, ఎన్నో ఏళ్ళ నుండి గీత ఆర్ట్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఈయన డిస్ట్రిబ్యూట్ లేదా నిర్మిస్తున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం లో తండేల్ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న బన్నీ వాసు, రీసెంట్ గానే మహావతార్ నరసింహా, కాంతారా 2 , లిటిల్ హార్ట్స్ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇలా కెరీర్ పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ వాసు, తన కెరీర్ ఎలా మొదలైందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ గారికి నేనంటే చాలా అభిమానం. నన్ను ఆయన చాలా గట్టిగ నమ్మేవారు. ఒకప్పుడు ఆయన ఏ డైరెక్టర్ దగ్గరైన కూర్చొని స్టోరీ వినేముందు నన్ను కూడా తనతో పాటు కూర్చోపెట్టుకునేవాడు. నా అభిప్రాయం కూడా తీసుకునేవాడు. ఆర్య సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయం లో, సినిమా చాలా బాగా వచ్చింది, నువ్వు పాలకొల్లు లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకో, దిల్ రాజు తో నేను మాట్లాడుతాను అని చెప్పాడు. ఒకరోజు దిల్ రాజు గారి దగ్గరకు వెళ్ళాను, మొత్తం వెస్ట్ గోదావరి తీసుకోమన్నాడు. నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వు, కానీ జిల్లా మొత్తం నువ్వే బిజినెస్ చెయ్యి అన్నాడు. అప్పుడు నా దగ్గర 45 రూపాయిలు మాత్రమే ఉన్నింది. అదే ఆయనకు ఇచ్చాను, నవ్వుతూ తీసుకున్నాడు, మిగిలినవి తర్వాత ఇవ్వమన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు. అలా 45 రూపాయలతో వ్యాపారం మొదలు పెట్టి నేడు కోట్లలో సంపాదిస్తున్నాడు.