Bunny Vasu: బండ్ల గణేష్(Bandla Ganesh)..పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒక సాధారణ కమెడియన్ గా కెరీర్ ని ఆరంభించి, మరోపక్క హైదరాబాద్ లో కోళ్ల ఫారం నడుపుతూ మంచి వ్యాపారవేత్త గా ఎదగడమే కాకుండా, టాలీవుడ్ లో నిర్మాతగా మారి ఎన్నో సంచలనాత్మక సూపర్ హిట్ సినిమాలు తీసిన చరిత్ర ఆయనది. బండ్ల గణేష్ అంటే మన అందరికీ పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడు. ఆ రేంజ్ వీరాభిమాని గా, భక్తుడిగా టాలీవుడ్ లో ఒక రేంజ్ లో నాటుకుపోయాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడల్లా తన విశ్వరూపం చూపించేస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు పవన్ ఫ్యాన్స్ బ్యానర్స్ లో ఇప్పటికీ వేసుకుంటూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి బండ్ల గణేష్ ఈమధ్య బాగా సైలెంట్ అయిపోయాడు. సినిమాలు తీయడం లేదు, సినిమాల్లో నటించడం లేదు కూడా. త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాను అని అంటున్నాడు కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఫోకస్ పెట్టలేదు.
అయితే చాలా కాలం తర్వాత ఆయన గత నెలలో విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీటింగ్ కి ఒక అతిథిగా విచ్చేశాడు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ ని కొనుగోలు చేసి భారీగా విడుదల చేసాడు. ఈ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు చేసేదేమి లేదు, కష్టపడకుండా సంపాదించేస్తున్నాడు, మొత్తం బన్నీ వాసు నే చూసుకుంటున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనిపై బన్నీ వాసు ఆరోజే స్టేజి మీద సమాధానం ఇచ్చాడు కానీ, రీసెంట్ గానే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మరోసారి ఈ ఘటన పై రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. కెరీర్ లో ఎప్పుడూ నేను అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదురుకోలేదు. అప్పుడే స్టేజి మీదకు వచ్చి మైక్ లాక్కొని మాట్లాడాలని అనిపించింది. కానీ ఈ విషయాన్నీ ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేడిక వదిలేసాను. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ దీపావళి కానుకగా బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ‘మిత్రమండలి’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు. మరి దీనికి బండ్ల గణేష్ రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.
https://t.co/JVTpYKTDyy pic.twitter.com/0YXoP3NVmE
— M9 NEWS (@M9News_) October 9, 2025