Nag Ashwin: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా మారిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ వెంటనే ఆయన ప్రభాస్ తో చేసిన ‘కల్కి’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించడమే కాకుండా ప్రేక్షకులందరిలో తనకంటూ ఒక చిరస్మరణీయమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. నాగ్ అశ్విన్ చేసిన ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ ఉంటున్నాడు దానికి గల కారణమేంటి అంటూ కొంతమంది కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని వార్తలనైతే వైరల్ చేస్తున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ శేఖర్ కమ్ముల దగ్గర ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న క్యారెక్టర్ లో నటించాడు. అప్పుడే వీళ్లిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత్యం ఏర్పడింది.
ఇక అదే సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటించడం అతనితో కూడా వాళ్లకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ ఇద్దరు కూడా ఒకే ఏరియా కి చెందినా వ్యక్తులు… వీళ్లిద్దరిది ఒకటే డిస్ట్రిక్ కావడంతో వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత్యమైతే ఏర్పడింది. దాంతో నాగ్ అశ్విన్ చేసిన మొదటి సినిమాలోనే విజయ్ దేవరకొండ కి ఒక పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు.
ఆ తర్వాత మహానటి సినిమాలో కూడా తనకు ఒక మంచి రోల్ ఇచ్చాడు. ‘కల్కి 2’ లో సైతం అర్జునుడి క్యారెక్టర్ లో మనకు విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. అందులో తన పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడే విజయ్ దేవరకొండ వచ్చి నాగ్ అశ్విన్ తో నువ్వు డైరెక్టర్ అయితే నీ సినిమాలలో నన్ను తీసుకుంటావా బ్రదర్ అని అడిగాడట.
దానికి నాగ్ అశ్విన్ తప్పకుండా తీసుకుంటాను. నా ఒక్క సినిమాలో కాదు, ప్రతి సినిమాలో నిన్ను పతీసుకుంటానని చెప్పారట. దానికి విజయ్ మాత్రం కామెడీగా చెబుతున్నాడేమో అనుకున్నాడట. కానీ నాగ్ అశ్విన్ మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకొని తన ప్రతి సినిమాలో అతన్ని ఏదో ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు…
