Mrunal Thakur: సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి, ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘సీతారామం’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, టాలీవుడ్ లోని క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు లో ‘హాయ్ నాన్న’ ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాల్లో నటించింది. ‘హాయ్ నాన్న’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఈమె అడవిశేష్ తో ‘డెకాయిట్’ అనే చిత్రం చేసింది.
Also Read: రియా చక్రవర్తి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
ఇదంతా పక్కన పెడితే ఈ హాట్ బ్యూటీ చాలా కాలం నుండి అక్కినేని హీరోతో ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఆ హీరో మరెవరో కాదు సుమంత్(Sumanth Yarlagadda). వీళ్లిద్దరు కలిసి ‘సీతారామం’ చిత్రం లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారట. ఆ సినిమాలో హీరో, హీరోయిన్ ని విడదీసి కాస్త నెగటివ్ షేడ్ లో కనిపించిన సుమంత్, నిజజీవితం లో ఆ హీరోయిన్ ని ప్రేమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రీసెంట్ గా వీళ్లిద్దరికీ సంబంధించిన ఒక ఫోటో విడుదలైంది. అందులో సుమంత్ స్టైల్ గా అద్దాలు పెట్టుకొని కూర్చుంటే, అతని పక్కనే మృణాల్ ఠాకూర్ కూడా కూర్చొని స్మైల్ ఇస్తుంది. ఇది సీతారామం సమయం లో తీసుకున్న ఫోటో అయ్యుండొచ్చు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఆ సమయం లో సుమంత్ లుక్స్ వేరు. క్లీన్ షేవ్ తో, కోర మీసం తో ఉండేవాడు.
కానీ ఇప్పటి లుక్ వేరు. కాబట్టి ఇది లేటెస్ట్ ఫోటో నే అని అంటున్నారు నెటిజెన్స్. మరి వీళ్లిద్దరు ఎప్పుడు రిలేషన్ లో ఉన్నామని అధికారిక ప్రకటన చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతం లో సుమంత్ ‘తొలిప్రేమ’ మూవీ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఎందుకో అభిప్రాయం బేధాలు ఏర్పడడం వల్ల వీళ్లిద్దరు కేవలం రెండేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి సుమంత్ సోలో లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చాడు. చాలా సార్లు అతను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రూమర్స్ వచ్చాయి కానీ, అలాంటిదేమి లేదని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేసాడు. కానీ మృణాల్ ఠాకూర్ తో రిలేషన్ గురించి రెండు మూడు రోజుల నుండి ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్నప్పటికీ కూడా సుమంత్ ఇంకా స్పందించలేదు. దీని అర్థం కచ్చితంగా వీళ్ళ మధ్య రిలేషన్ నెడుతుంది అనే అనుకోవాలి.
Also Read: ఆ కారు యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది : హీరో నాని