Hit 3 Movie Collection: నేచురల్ స్టార్ నాని(Natural star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా భారీ గా వస్తున్నాయి కానీ స్టడీ గా మాత్రం లేవు. ఈ చిత్రం కచ్చితంగా ఈరోజుతో బ్రేక్ ఈవెన్ 90 శాతం సెంటర్స్ లో అవుతుంది. కానీ ఫుల్ రన్ లో మాత్రం భారీ వసూళ్లు వచ్చే సూచనలు లేవు. ఎందుకంటే ఒక సినిమా లాంగ్ రన్ లో స్టడీ కలెక్షన్స్ ని రాబట్టాలంటే, కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి. కానీ ‘హిట్ 3’ కంటెంట్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి అసలు సంబంధమే లేదు అనొచ్చు. అందుకే మూడవ రోజు, రెండవ రోజుతో పోలిస్తే కాస్త డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.
Also Read: ఆ కారు యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది : హీరో నాని
ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల షేర్ తెలుగు రాష్ట్రాల నుండి వస్తే, మూడవ రోజు కేవలం 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. పెద్ద డ్రాప్స్ కాకపోయినా లాంగ్ రన్ ఉండదు అనేందుకు ఇదే ఉదాహరణ. ఎందుకంటే శుక్రవారం వర్కింగ్ డే, శనివారం వీకెండ్ లెక్కలోకి వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళ హీరో సూర్య ‘రెట్రో’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ, రెండవ రోజుకంటే, మూడవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయట. ఇది ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మూడు రోజుల్లో ‘హిట్ 3’ ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాము. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 10 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, సీడెడ్ ప్రాంతం లో 3 కోట్ల 30 లక్షలు వచ్చాయి.
అదే విధంగా ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తూర్పు గోదావరి జిల్లా నుండి కోటి 64 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోటి 47 లక్షలు, గుంటూరు కోటి 85 లక్షలు, కృష్ణ జిల్లా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా నుండి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 24 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఓవర్సీస్ లో 9 కోట్ల 60 లక్షలు, ఇతర భాషల్లో 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మూడు రోజుల్లో 39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read: అక్కినేని హీరోతో ప్రేమాయణం..రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న మృణాల్ ఠాకూర్?