నటీనటులుః ఆది, సురభి, రాజీవ్ కనకాల, అజయ్, జయప్రకాశ్ తదితరులు
దర్శకత్వంః శ్రీనివాస్ నాయుడు నందికట్ల
నిర్మాణంః శ్రీ హనుమాన్ మూవీస్
సంగీతంః అరుణ్ చిలువేరు
రిలీజ్ డేట్ః 19 మార్చి, 2021
Also Read: మూవీ రివ్యూః మోసగాళ్లు
తొలిచిత్రం ‘ప్రేమ కావాలి’, ఆ తర్వాత వచ్చిన ‘లవ్ లీ’ మూవీతో యూత్ ను ఆకట్టుకున్న ఆదికి.. ఆ తర్వాత చెప్పుకోదగిన సినిమానే పడలేదు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. సక్సెస్ వరించలేదు. దీంతో.. ఇప్పుడు ‘శశి’ అనే చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ విజయం తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ కావడంతో.. దీనిపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు ఆది. మరి, ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం.
కథః రఫ్ అండ్ టఫ్ గా తిరిగే కాలేజీ కుర్రోడు ఆది. ఏదైనా తనకు నచ్చితేనే చేస్తాడు.. నచ్చినట్టే ఉంటాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే.. ఆ అమ్మాయి ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దాన్నుంచి తను ప్రేమించిన అమ్మాయిని బయట పడేయడానికి హీరో ఏం చేశాడన్నదే కథ. ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్య ఏంటి? దాన్ని ఆది ఎలా పరిష్కరించాడు అన్నది తెరపై చూడాలి.
కథనంః కాలేజీ లవ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని చిత్రాలు వచ్చాయో లెక్కేలేదు. తన లవర్ ఏదో ఒక సమస్యలో చిక్కుకోవడం హీరో.. వీరోచిత పోరాటాలు చేసి, ఆమెను అందులోంచి గట్టెక్కించడం కూడా అరిగిపోయిన రికార్డే. అలాంటి కథను ఎంచుకున్నప్పుడు కథనం అద్వితీయంగా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యే పాయింట్లనే పట్టుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్. కథ రొటీన్ అయినప్పటికీ.. మంచి లేయర్స్ తో ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. హీరోను అర్జున్ రెడ్డి లెవల్లో చూపించడానికి ట్రై చేశాడు. అయితే.. పలు సన్నివేశాలు డ్రాగ్ చేయడం విసుగు తెప్పిస్తుంది. మరికొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టే అనిపించడంతో బోర్ కొడుతుంది.
Also Read: మూవీ రివ్యూః చావుకబురు చల్లగా
పెర్ఫార్మెన్స్ః ఆది హీరోయిజం ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. యాక్షన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. తనలోని డెప్త్ ఏంటనేది ఈ సినిమా ద్వారా మరింతగా చాటిచెప్పాడు. ఇప్పటి వరకూ తనపై ఉన్న క్లాస్ ఇమేజ్ ను మాస్ యాంగిల్ లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక, హీరోయిన్ సురభి అందంగా కనిపించింది. అంతేకాదు.. స్కిన్ షోకు ఏమాత్రం మొహమాట పడలేదు. రాజీవ్ కనకాల తనదైన శైలిలో మెప్పించగా.. అజయ్, జయప్రకాశ్ తమ పాత్రల పరిధిమేరకు న్యాయం చేశారు. ఇక దర్శకుడి గురించి మాట్లాడుకుంటే.. ఈయన కూడా సుకుమార్ శిష్యుడే. ఈ సినిమా టేకింగ్ లో గురువు ఛాయలు కనిపిస్తాయి. సంగీత దర్శకుడు ‘ఒకే ఒక లోకం’ అనే పాట ద్వారా సినిమా విడుదలకు ముందే అంచనాలు పెంచేసినప్పటికీ.. సినిమా విడుదలైన తర్వాత తేలిపోయాడు. ఆ ఒక్క పాట మాత్రమే బాగుంది. మణికుమార్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. రవి డైలాగులు కూడా మెప్పించాయి. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునేవారు ఓ సారి వెళ్లి రావొచ్చు.
బలాలుః ఆది నటన, కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే
బలహీనతలుః రొటీన్ కథ, సాగదీసే సన్నివేశాలు
లాస్ట్ లైన్ః రొటీన్ లవ్ స్టోరీ
రేటింగ్ః 2
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్