Homeఎంటర్టైన్మెంట్Funky Movie Review: మూవీ రివ్యూ : డింకీ కొట్టిన ‘ఫంకీ’

Funky Movie Review: మూవీ రివ్యూ : డింకీ కొట్టిన ‘ఫంకీ’

Funky Movie Review: నటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్, సీనియర్ నరేష్, సంపత్ రాజ్ తదితరులు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
దర్శకత్వం: అనుదీప్ KV
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక సెక్షన్ కు ఈ చిత్రంపైన అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ తో మరో జాతిరత్నాలు తరహా కామెడీ ట్రై చేస్తున్నారనే విషయం అందరికీ అర్థం అయింది. అర్థం అయినా ఇలాంటి సిల్లీ కామెడీలతో ప్రేక్షకులను మెప్పించడం అంత సులువు కాదని ఈమధ్య చాలా సినిమాలు రుజువు చేశాయి. ఈ ఫంకీ ప్రేక్షకులను సీరియస్ గా మెప్పించిందా లేదా సిల్లీగా మిగిలిపోయిందా అనేది చూద్దాం.

కోమల్(విశ్వక్ సేన్) సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనుకునే ఒక యువకుడు. తనకు ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాత సీనియర్ నరేష్ అవకాశం ఇస్తాడు. బడ్జెట్ నాలుగు కోట్లని చెప్పి సినిమా తీయడం మొదలుపెడతారు కానీ ఫస్ట్ కాపీ రాకముందే నలభై కోట్లు ఖర్చవుతుంది. ఈ షాక్ తో నిర్మాతకు స్ట్రోక్ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత కూతురు చిత్ర(కయాదు లోహార్) రంగంలోకి దిగి మరో కోటి రూపాయలతో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆగిన సినిమాను తిరిగి మొదలుపెడుతుంది. ఈ ప్రయత్నంలో వారికి ఎదురైన అడ్డంకులేవి? కోమల్ కు చిత్రకు మధ్య ఏం జరిగింది? ఫైనల్ గా సినిమా రిలీజ్ అయిందా? హిట్టు కొట్టారా అనేది మిగతా కథ.

కామెడీ అయినా, సిల్లీ కామెడీ అయినా ఒక సినిమాలో కథ రెండు గంటల పాటు ఒక ఫ్లోలో సాగడం ముఖ్యం. ఈ సినిమాలో కథ ఉంది కానీ ఫ్లో లేదు. పంచ్ లు పడుతూ ఉంటాయి, అక్కడక్కడా నవ్వు వస్తుంది కానీ దేనికవే సంబంధం లేనట్టు ఉంటాయి. దర్శకుడు అనుదీప్ ప్రతి పాత్ర ప్రతి డైలాగ్ లో నవ్వించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది కానీ అది అర్థం చేసుకొని సహృదయంతో అన్నిటికీ నవ్వలేం. పెద్దగా ట్విస్టులు కూడా లేకపోవడంతో సినిమా అంతా ఫ్లాట్ గా సాగింది. ఎమోషన్స్ ఏవీ లేనట్టుగా చూపించిన హీరో పాత్రకు ఎమోషన్స్ ఉన్నాయని క్లైమాక్స్ లో జస్టిఫై చేయడం బాగుంది కానీ అది కూడా పూర్తిగా పండలేదు. మొదట్లో స్ట్రాంగ్ విలన్ లా చూపించిన GK సంపత్ రాజ్ పాత్రను చివరికి సిల్లీ విలన్ గా ముగించడంతో కాన్ ఫ్లిక్ట్ మిస్ అయింది. హీరో పాత్ర తప్ప మిగతా పాత్రలన్నీ బలహీనంగా ఉండడం కూడా సినిమాకు మైనస్ అయింది.

ఈమధ్య మంచి హిట్ ఆల్బమ్స్ అందిస్తున్న భీమ్స్ ఈ సినిమాతో నిరాశపరిచాడు. పాటలు బాగలేవు. పాటల ప్లేస్ మెంట్ కూడా సరిగ్గా కుదరలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా నిడివి రెండు గంటలే ఎడిటింగ్ షార్ప్ గా లేదనిపించింది అంటే అది రైటింగ్ లో ఫాల్ట్ ఆనే చెప్పాలి. దర్శకుడు హరీష్ శంకర్ కాసేపు అతిథి పాత్రలో మెరిసినా ఆయన పంచ్ లు కృత్రిమంగా అనిపించాయి. ఇలాంటి సీన్స్ కొన్ని ఎడిటింగ్ లో కత్తెర పడాల్సినవి ఉన్నాయి.

విశ్వక్ సేన్ యాక్టింగ్ డీసెంట్ గా ఉంది కానీ సినిమాలో కొన్ని చోట్ల సన్నగా, కొన్ని చోట్ల మామూలుగా కనిపించాడు. చిత్ర పాత్రలో హీరోయిన్ కయాదు లోహార్ అందంగా ఉంది తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. మురళీధర్ గౌడ్ ఒక్క సీన్ లోనే కనిపించినా నవ్వించాడు.

– సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. కథలో ఫ్లో లేకపోవడం
2. పాటలు
3. పంచ్ లో ఎక్కువై చాలావాటికి నవ్వు రాకపోవడం

– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. అక్కడక్కడా కాసిన్ని నవ్వులు

రేటింగ్: 2/5

ఫైనల్ వర్డ్: పంచ్ లేని పంచ్ ల కలెక్షన్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version