spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. నోరెత్తని వారికే పదవులు..

జగన్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. నోరెత్తని వారికే పదవులు..

Jagan
ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీని తప్ప మిగితా అన్నింటిలోనూ క్లీన్‌ స్వీప్ చేసింది వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ. అయితే.. మేయర్లు, చైర్మన్ల ఎంపికలో జగన్‌ తన మార్క్‌ చూపినట్లుగా అర్థమవుతోంది. సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. సొంత పార్టీ నేతలు ఎదగకుండా పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. పెద్దగా నోరు లేని నేతల్ని చూసి.. వారందరికీ పదవులు కేటాయించింది.

ఈ పదవుల కేటాయింపులో సిఫార్సులు గట్రా ఏమీ పని చేయలేదు. కొంత మందికి కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయడానికి రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొంత మంది మీడియా ముందుకొచ్చి పాఠాలు అప్పచెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపుగా ప్రతీ చోటా ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు అసంతృప్తికి గురయ్యారు. విశాఖలో అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మేయర్ చేస్తామని చెప్పి.. కార్పొరేటర్‌గా నిలబెట్టి చివరికి ఆయన్ను కార్పొరేటర్ గానే ఉంచారు. ఫైనల్‌గా ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

వైసీపీ హైకమాండ్ బలమైన నేతలకు కాకుండా పెద్దగా గుర్తింపు లేని వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి పదవులు కేటాయించింది. పార్టీ క్యాడర్‌లో పలుకుబడి ఉన్న వారు పదవులతో మరింత బలపడతారని.. దాని ద్వారా భవిష్యత్‌లో వర్గ పోరాటం పెరిగిపోతుందన్న అంచనాలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. ఎమ్మెల్యే, ఎంపీలు సిఫార్సులు చేసిన వారికి చాలా తక్కువగా పదవులు లభించాయి. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడికి డిప్యూటీ మేయర్‌‌గా చాన్స్ ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎక్కువ మందికి చాన్స్ లేకపోవడంతో వారందరికీ మరో డిప్యూటీ మేయర్.. మరో డిప్యూటీ చైర్మన్ పదవి ఇస్తామని.. ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నామని చెప్పి నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు..

తాత్కాలికంగా వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ అసంతృప్తి రగిలించినా పార్టీలో కింది స్థాయిలో ఒకరి మీద ఒకరు పోటీ పడే స్థాయిలో బలమైన నాయకత్వం ఎదగకుండా తమకు విధేయులుగా ఉండే వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. వైసీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా బలమైన నేతల్ని పక్కన పెట్టి.. గ్రూపు తగాదాలు పెరగకుండా చూసుకుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో మహిళలకు చాన్సులిచ్చామని.. బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రచారం చేసుకోవడానికి కూడా బాగుంటుందని వైసీపీ వ్యూహం అంటున్నారు. మొత్తంగా జగన్‌ తన మార్క్‌ రాజకీయం చూపించారనే టాక్‌ కూడా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version