నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. చదువు పూర్తి చేసిన వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటే ఉద్యోగాలు మాత్రం లక్షల్లో ఉన్నాయి. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. Also Read: సెప్టెంబర్‌‌లో కామన్‌ ఎలిజిబిలిటీ […]

Written By: Navya, Updated On : March 19, 2021 1:43 pm
Follow us on

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. చదువు పూర్తి చేసిన వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటే ఉద్యోగాలు మాత్రం లక్షల్లో ఉన్నాయి. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

Also Read: సెప్టెంబర్‌‌లో కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌..!

https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 9069 ఉద్యోగాలను భర్తీ చేసింది. దాదాపు ఇదే సంఖ్యలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు.

Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..?

గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేష‌న్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సం జనవరి నెల 1వ తేదీ నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కంప్యూట‌ర్ బేస్డ్ రాత ప‌రీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రెండు దశల పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.