Hey balwanth movie review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తమ సత్తా ను చూపిస్తున్నాయి. ముఖ్యంగా గొప్ప కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి… కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ను సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ లను సాధించకపోయిన కూడా ‘హే బల్వంత్’ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
సుహాస్ తన ఫాదర్ అయిన నరేష్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ను స్టార్ట్ చేస్తారు…ఆ బిజినెస్ వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నారు..? సుహాస్ అమితంగా ప్రేమించిన శివాని నాగారం తో ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి..? వీళ్ళ ప్రేమను శివాని వాళ్ల నాన్న ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఫైనల్ గా సుహాస్ – శివాని ఇద్దరు కలిసారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా మొత్తం కామెడీ జానర్ లో నడిపించే ప్రయత్నమైతే చేశారు. మొదటి నుంచి కూడా సినిమా కామెడీ ట్రాక్ లోనే వెళ్తూ అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ముందుకైతే తీసుకెళ్లారు. ముఖ్యంగా హీరో వాళ్ళ ఫాదర్ చేస్తున్న బిజినెస్ మీద చాలావరకు జోకులైతే పేలాయి. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే చాలా వరకు డల్ అయిందనే చెప్పాలి. ఫస్టాఫ్ లో ఎంత హై ఎనర్జీ ఉందో సెకండాఫ్ లో అంతకు మించి డల్ అయింది. సుదర్శన్ అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో పంచులు పేల్చినప్పటికి ఆయన కనిపించినంత సేపు మాత్రమే సినిమా ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా ముందుకు సాగింది…
ఒకరకంగా ఈ సినిమాకి సుహాస్ కంటే సుదర్శన్ హీరోనేమో అనిపించే రేంజ్ లో తన భుజాల మీద ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు…సుహాస్ గత సినిమాలతో ఆకట్టుకొనప్పటికి ఈ సినిమా విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. సినిమాలో కామెడీ ఓకే అనిపించినప్పటికి ఎమోషనల్ సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా పండలేదు. ఎక్కడైతే ఎమోషనల్ సన్నివేశాలు ఎలివేట్ అవ్వవో ఆ సినిమా ప్రేక్షకుడిని పూర్తిగా సంతృప్తి పరచదు… సినిమాలో దర్శకుడు ఒక పాయింట్ ను మాత్రమే ఎలివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు.
ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి దాన్ని పూర్తిగా ఎమోషనల్ గా మార్చాలని అనుకున్నాడు. అక్కడే అతను పప్పులో కాలేశాడు. ఎమోషనల్ సన్నివేశాలు పండాలి అంటే ఆ సీన్ లోనే డెప్త్ అనేది ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ కానప్పుడు స్క్రీన్ మీద ఎంత ఎమోషనల్ సన్నివేశాన్ని పండించడానికి ట్రై చేసిన కూడా అది ప్రేక్షకుడి యొక్క మనసుకు అయితే తాకదు. అలాంటప్పుడు ఆ సన్నివేశాలు ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయవు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
సుహాస్ నటుడిగా చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కామెడీని కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమా విషయంలో ఆయన ఇంకాస్త స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుండేది. నటన పరంగా ఓకే అనిపించినప్పటికి కంటెంట్ పరంగా ఇంకా బెటర్ గా ఆలోచించి ఉంటే బాగుండేది. శివాని నాగారం సైతం ఈ సినిమాతో మెప్పించింది… రీసెంట్ గా ఆమె వరుసగా సక్స్ లను సాధిస్తుంది.
ఈ సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా మార్చడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇక నరేష్ తన నటనతో ఈ సినిమాను ఇంకో మెట్టు పైకెక్కించాడనే చెప్పాలి. తన నటనతో కామెడీ ని బాగా ఎలివేట్ చేశాడు. ఆయనకి చాలా మంచి పాత్రలైతే దొరుకుతున్నాయి. దొరికిన ప్రతి పాత్రలో తనదైన శైలిలో నటించి మెప్పిస్తున్నాడు. సుదర్శన్ మాత్రం తన కామెడీ పంచులతో సినిమా మొత్తాన్ని ఎంటర్టైనింగ్ ముందుకు తీసుకెళ్లాడు… మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఈ సినిమాకి వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించాడు. ముఖ్యంగా అండర్టేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకు మంచి గుర్తింపైతే ఉంది. బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ప్రతి సీన్ హైలెట్ అవ్వడంలో అతని బ్యాగ్రౌండ్స్ కు చాలా వరకు హెల్ప్ అయింది. సినిమాటోగ్రాఫర్ సైతం ఎక్కడ కూడా అనవసరమైన షాట్స్ ను వాడకుండా డిఫరెంట్ షాట్స్ ని వాడి సినిమాకి ఒక రేంజ్ అయితే తీసుకొచ్చాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించేలా ఉన్నాయి…
ఈ సినిమాలో బాగున్నవి
సుహాస్ యాక్టింగ్
సుదర్శన్ కామెడీ
ఫస్టాఫ్
ఈ సినిమాలో బాగోలేనివి
కథ
సెకండాఫ్ స్క్రీన్ ప్లే
ఎమోషనల్ సన్నివేశాలు
రేటింగ్ : 2.25/5
ఫైనల్ థాట్ : ఖాళీగా ఉంటే ఒకసారి చూడవచ్చు…
