Euphoria Movie Review : గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. కారణమేంటంటే మన వాళ్ళు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. ఇక గతంలో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న గుణశేఖర్ భారీ బడ్జెట్ సినిమాలను చేస్తాడు అనే పేరైతే ఉంది. చిరంజీవి, మహేష్ బాబు లకు సూపర్ హిట్లు ఇచ్చిన ఘనత తనకే దక్కుతోంది. ప్రస్తుతం ఆయన యూత్ కి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘యుఫోరియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది. సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
కథ
చైత్ర (సారా అర్జున్) చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్…ఎప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె కల…దానికి తగ్గట్టుగానే చాలా ఎక్కువ సేపు చదువుతుంటుంది…అనుకోకుండా ఒకరోజు తన ఫ్రెండ్ తో కలిసి ఒక పబ్ కి వెళ్తుంది…ఇక అక్కడ తాగిన మైకంలో ఉన్న వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి) కి చైత్ర మీద కన్ను పడుతుంది. ఎలాగైనా తనని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక తనతో మాటా మాటా కలిపి ఆ పబ్ నుంచి బయటికి వెళ్దాం అని చెబుతాడు… చైత్ర తనని ఫ్రెండ్ గా బావించి తనతో పాటు వెళ్తుంది… వెళ్ళిన తర్వాత ఏం జరిగింది.? చైత్ర తన ఐ ఏ ఎస్ అవ్వాలనుకున్నా తన లక్ష్యాన్నీ చేరుకుందా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
గుణశేఖర్ ఈ సినిమాని యూత్ ఫుల్ కంటెంట్ గా తెరకెక్కించాడు. తాగిన మత్తులో యూత్ ఎలాంటి చెడు దారులు ఎంచుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ కెరియర్లు ఎలా నాశనం అవుతున్నాయి అనే పాయింట్ ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. మొదటి నుంచి కూడా యూత్ ను టార్గెట్ చేస్తూనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. దర్శకుడు ప్రతి విషయంలో తనకున్న మెచ్యూరిటీని చూపించాడు… ఫస్టాఫ్ లో యూత్ ఎందుకు చెడిపోతున్నారు. వాళ్ళు చెడు అలవాట్లకు ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది చాలా క్లియర్ గా చూపించాడు. ఆ తర్వాత సినిమాలోని అసలు ప్రాబ్లం లోకి తీసుకెళ్తాడు… ఈ ఎంటైర్ సినిమాలో ఐఏఎస్ అవ్వాలనుకున్న చైత్ర కి జరిగిన అన్యాయాన్ని చాలా చక్కగా వివరించాడు. ఫస్టాఫ్ మొత్తం ఎక్కడా బోరింగ్ లేకుండా చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లాడు. సెకండాఫ్ సమాజాన్ని మేలుకొలుపే డైలాగులను సైతం అతను చెప్పించాడు.
ముఖ్యంగా కోర్టు సన్నివేశం అయితే అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో రానట్టుగా చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ప్రతి డైలాగు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నిజానికి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసి చూపించారు. తద్వారా పేరెంట్స్ కూడా ఈ సినిమాని చూసి వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత యుతంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలుసుకోవాలి…ఎమోషనల్ సన్నివేశాల్లో కాలభైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.
భూమిక యాక్టింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత భూమిక ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేయగలిగింది. ఇక గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులందరిని మెప్పించగలిగాడు… మొత్తానికైతే ఈ సినిమా ఒక టైం పాస్ సినిమా గా కాకుండా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే పేరెంట్స్ తమ నిత్య జీవితంలో వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేది కూడా వాళ్లకు తెలుస్తుంది. ఇక యూత్ సైతం మనం ఎలాంటి మార్గంలో వెళ్తున్నాం, మనం పెట్టుకున్న గోల్స్ ఏంటి మనం నడుస్తున్న మార్గం ఏంటి అనేది కూడా చూపించారు…
ఇక సినిమాటోగ్రఫీ విషయంలో కూడా దర్శకుడు చాలా వరకు కీ రోల్ తీసుకున్నాడు. ప్రతి షాట్ ని తనకు అనుకూలంగా తీయించుకొని ఈ జనరేషన్లో ఉన్న దర్శకులకు ఏమాత్రం తీసిపోనని తన టాలెంట్ ను చూపించాడు… ఒక సెన్సిటివ్ ఇష్యూను స్క్రీన్ మీద చెప్పినప్పుడు దానికి ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పిన కూడా చాలా వరకు విమర్శలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కానీ గుణశేఖర్ మాత్రం ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా చాలా చక్కగా సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
భూమిక మదర్ క్యారెక్టర్ లో నటించి ఇప్పుడున్న పేరెంట్స్ ఎలాంటి స్ట్రగుల్ ని ఎదుర్కొంటున్నారు అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు… ఆమె ఆ క్యారెక్టర్ లో నటించడం కాదు జీవించిందనే చెప్పాలి… ఈ మధ్యకాలంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించినప్పటికి ఆమెకు ఇలాంటి రోల్ ఎప్పుడూ రాలేదు. ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండటమే కాకుండా అది చాలా ఎఫెక్టివ్ గా ఉండడంతో ఆమె కూడా తన నటన చేయాలని బయటకు తీసి మరి యాక్టింగ్ చేసింది…
ఇక గౌతమ్ మీనన్ సైతం చాలా డిఫరెంట్ ప్రయత్నమైతే చేశాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో డీసెంట్ యాక్టింగ్ ని కనబరిచినప్పటికి ఈ సినిమాలో అంతకుమించిన పర్ఫామెన్స్ ఇచ్చాడు… అందుకే సారా అర్జున్ సైతం చైత్ర క్యారెక్టర్ లో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక అన్యాయం జరిగిన యువతి ఎలా ఉండాలి. తన హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేయాలి. ఆడవాళ్లు ఎప్పుడు వీక్ కాదు చాలా స్ట్రాంగ్ అనే ఒక పాత్రని తను పెర్ఫార్మ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక మెయిన్ లీడ్ లో చేసిన నటులు కూడా బాగా చేశారు. ముఖ్యంగా విఘ్నేష్ పాత్ర కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది…
టెక్నికల్ అంశాలు
కాలభైరవ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు. గతంలో వచ్చిన కొన్ని సినిమాలతో అతను చాలా వరకు వెనుకబడిపోయారు. కానీ ఈ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది ప్రేక్షకులను ఆకట్టుకుంది…సినిమాటోగ్రాఫర్ సెలెక్టెడ్ షాట్స్ తో అదరగొట్టాడు…ఎక్కడ కూడా హంగులు అర్భాటాలు లేకుండా తీశారు… ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది… ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి…
ఈ మూవీ లో బాగున్నవి
క్లైమాక్స్ సీన్
డైలాగ్స్
డైరెక్షన్
మ్యూజిక్
ఈ మూవీలో బాగోలేనివి
సెకండాఫ్ లో ఒక రెండు సీన్స్ డల్ అయ్యాయి…
రేటింగ్ : 3/5
ఫైనల్ థాట్ : యూత్, పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా…
