Raju Yadav Review: రాజు యాదవ్ ఫుల్ మూవీ రివ్యూ…

గెటప్ శ్రీను హీరోగా చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలాసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By: Gopi, Updated On : May 24, 2024 9:07 am

Raju Yadav Review

Follow us on

Raju Yadav Review: జబర్దస్త్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు గెటప్ శీను.. అయితే ఈయనను బుల్లితెర కమలహాసన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు నవ్వు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి అలాంటి క్రమంలోనే గెటప్ శీను ఈమధ్య సినిమాల సంఖ్యను భారీ సంఖ్యలో పెంచినట్టుగా తెలుస్తుంది. తను హీరోగా రాజు యాదవ్ అనే ఒక పేరుతో ఒక సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఇవాళ్ళ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది.? గెటప్ శ్రీను హీరోగా చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలాసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజు యాదవ్ అనే ఒక వ్యక్తి తన బాడీలో జరిగిన కొన్ని మార్పులు వల్ల ఆయన ఎప్పటికీ నవ్వుతూనే ఉంటాడు. ఇక దానివల్ల ఆయన చాలా రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. జనాలు చాలామంది వీడికి పిచ్చా ఏంటి అని అనుకుంటున్నారు. కానీ తను అలాంటి ఒక ప్రాబ్లం ను ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాడు.తన ఫేస్ మీద నుంచి నవ్వు పోయి మామూలు మనుషులాగ కావాలంటే తనకు ఒక సర్జరీ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.

అయితే దానికి సంబంధించిన డబ్బులను సమకూర్చే పనిలో రాజు యాదవ్, వాళ్ల నాన్న ఇద్దరూ బిజీగా ఉంటారు. అయితే ఇంతలోనే లోనే తనకు స్వీటీ (అంఖితా కారట్) అనే అమ్మాయి కలుస్తుంది. ఇక వీళ్ళ మధ్య ప్రేమ అనేది కూడా చిగురుస్తుంది. మరి రాజు యాదవ్ తన మూతికి సర్జరీ చేయించుకొని మామూలుగా అయ్యాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ముందుగా ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా పాయింట్ ను చాలా గొప్పగా చెప్పాడు. ఒక డిఫెక్ట్ ఉన్నవాడు సమాజంలో ఎలాంటి భావాలతో బతుకుతూ ఉంటాడు. అనే విధంగా ఈ పాయింట్ ని మలచడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక అలాంటి ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చాడు. తన ప్రస్థానం ఏంటి అనే వాటికి పెద్ద పీట వేస్తూ ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఇక ఇదిలా ఉంటే సినిమా ఎస్టాబ్లిష్ మెంట్ కోసం ఆయన కొంచెం ఎక్కువ టైమ్ ని తీసుకున్నారు. అయితే ఈ సమయంలో సీన్లు అనేవి ప్రేక్షకులకు కొంతవరకు బోర్ కొట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇంటర్ వెల్ లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు కొద్ది వరకు సక్సెస్ చేయడనే చెప్పాలి… అయితే కొన్ని సీన్లలో కొన్ని ఎలివేషన్స్ ను కూడా చాలా బాగా ఇచ్చాడు.ఇక రాజు యాదవ్ క్యారెక్టర్ లో గెటప్ శ్రీను యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి… ఇక క్లైమాక్స్ లో దర్శకుడు కృష్ణమాచారి రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే గెటప్ శీను మెయిన్ లీడ్ చేశాడు. కాబట్టి ఈ సినిమా భారం మొత్తాన్ని తనే ఒంటి మీద వేసుకొని మోసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఫేస్ మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. అయిన కూడా శ్రీను ఆ క్యారెక్టర్ ను చాలా సునాయాసంగా చేసేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక హీరోయిన్ గా చేసిన అంకిత కారట్ కూడా శీను క్యారెక్టర్ కి బాగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడంలో చాలావరకు హెల్ప్ అయ్యారు. ఇక ఈ సినిమాలో వీళ్లతో పాటుగా మరికొన్ని పాత్రల్లో నటించిన నటీనటులందరు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన ‘సురేష్ బొబ్బిలి’ మ్యూజిక్ అయితే కొంతవరకు పర్లేదు అనిపించింది. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ సీన్ లో ఉన్న ఎమోషన్స్ హైలెట్ చేయడంలో తన మ్యూజిక్ అనేది చాలా వరకు హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా ప్రతి సీన్ లో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది కూడా కొద్ది వరకు పర్లేదు అనిపించింది… విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ముఖ్యంగా రాజు యాదవ్ గా చేసిన గెటప్ శీను ను తను చాలా బాగా చూపించగలిగాడు. దానివల్ల సినిమా అనేది మరింత స్థాయిలో ఎలివేట్ అయిందనే చెప్పాలి… ఇక చంద్రబోస్, కసర్ల శ్యామ్ రాసిన పాటలకు లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూడడానికి వీళ్లంతా చాలా కష్టపడ్డారనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంత లో బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

కథ
గెటప్ శ్రీను యాక్టింగ్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్

కొన్ని లాజిక్ లేని సీన్లు…

రేటింగ్

ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.25/5

చివరి లైన్

గెటప్ శ్రీను యాక్టింగ్ కోసం ఒక్కసారి ఈ సినిమాను చూడవచ్చు…