Turbo Review: టర్బో ఫుల్ మూవీ రివ్యూ…

బ్రమ యుగం లాంటి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్న మమ్ముట్టి ఇప్పుడు టర్బో అనే సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

Written By: Gopi, Updated On : May 24, 2024 8:51 am

Turbo Review

Follow us on

Turbo Review: మలయాళం సినిమా ఇండస్ట్రీ అంటేనే కొత్త కథంశాలకు మారుపేరుగా మారింది. ఇక రీసెంట్ గా మమ్ముట్టి లాంటి వాళ్ళు అయితే వరుస సినిమలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఈయన సక్సెస్ వెనక సీక్రెట్ ఏంటి సినిమా సినిమాకు మధ్య జానర్ అనేది మారుస్తూ వివిధ జానర్స్ లో మంచి కథలను ఎంచుకొని ఈ సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఆయన చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పటికే బ్రమ యుగం లాంటి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్న ఈయన ఇప్పుడు టర్బో అనే సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే అయితే ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాని సక్సెస్ చేశారా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే జోస్ (మమ్ముట్టి)అనే వ్యక్తి కి తన ఫ్రెండ్స్ అంటే ప్రాణం…వాళ్ల కోసం ఎలాంటి రిస్క్ అయిన చేస్తూ ఉంటాడు. ఇక జెర్రీ (శబరీష్ వర్మ) ను ప్రేమించాడని తెలుసుకున్న ఈయన ఇందులేఖ (శబరీష్ వర్మ) ను ప్రేమించాడని ఇందులేఖ(అంజన ప్రకాష్) ను తీసుకువస్తాడు… అయితే అనుకోని కారణాలవల్ల ఆమె తర్వాత చెన్నై రావాల్సి వస్తుంది. ఇక అందులో భాగంగానే తన పేరెంట్స్ కూడా తనను ఎవరో కిడ్నాప్ చేశారనే విషయం లో కేసు పెడతారు. ఇక దాంతో వీళ్ళను దూరం పెట్టి ఇందులేఖ తనతో మాట్లాడకుండా దూరం వెళ్ళిపోతుంది.

ఇక దాంతో ఒకరోజు జెర్రీ తన ప్లాట్ లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు… అసలు ఇలా ఎందుకు జరిగింది.? జెర్రీ ఆత్మహత్య చేసుకోవడానికి ఇందులేక మాట్లాడకపోవడమే కారణమా.?లేదంటే మరి ఏదైనా కారణం ఉందా.? అంటూ ఈయన ఆత్మహత్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎలా తెలుసుకున్నాడు అనేది మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విశానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన వైశాక్.. ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడనే చెప్పాలి. ఇంకా ఇంతకుముందు మోహన్ లాల్ తో ‘మన్యంపులి ‘ అనే సినిమాను తీసిన ఈయన ఈ సినిమాతో మరొకసారి తన మార్క్ స్టామినా ఏంటో చూపించుకున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఎలాంటి ఎమోషన్ అయితే ఉంటుందో ఈ సినిమాలో కూడా అలాంటి ఎమోషన్ ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. జోసి ఫ్రెండ్ అయిన జెర్రీ మరణం వెనుక దాగి ఉన్న కారణాలేంటి.? అనే విషయాలను తెలుసుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఇంట్రెస్ట్ ని తెప్పిస్తుంది… ఇక దర్శకుడు రాసుకున్న కథ కూడా ఈ సినిమా బాగా రావడానికి ఒక మంచి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మమ్ముట్టి కూడా వరుసగా మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర చాలా అద్భుతంగా రాసుకున్నారు. ఇక దర్శకుడు పెపర్ మీద ఎలాంటి రైటింగ్ అయితే చేశాడో స్క్రీన్ మీద కూడా దాన్నే ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కమర్షియల్ సినిమాల్లో ఎలాంటి కీలక పాత్రను వహిస్తాయో అలాంటి వాటిని మిస్ అవ్వకుండా డీల్ చేశారు. ఇక మొత్తానికైతే తను అనుకున్నట్టుగా ఈ సినిమాని తెరకెక్కించగలిగాడు. ఇక ఇదిలా ఉంటే కొన్ని సీన్లు మాత్రం సినిమాని చాలావరకు స్లోగా నడిపిస్తూ ఆ ఫ్లోకి అడ్డుపడిందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్లు అయితే ప్రేక్షకులను ఏ మాత్రం ఎంగేజ్ చేయలేకపోయాయి…

ఆర్టిస్తుల పర్ఫామెన్స్

ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మమ్ముట్టి అన్ని సినిమాలా మాదిరిగానే ఈ సినిమాలో కూడా తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అయితే తను 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నా కూడా ఏమాత్రం అలుపు సలుపు లేకుండా అన్ని యాక్షన్ సీక్వెన్స్ లో అయితే పాల్గొన్నాడు. యంగ్ హీరోలకు సైతం సాధ్యం కానీ రీతిలో యాక్షన్ సీక్వెన్స్ చేసి ఔరా అనిపించాడు… ఇక కన్నడ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో విలన్ గా నటించడం సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లలో అయితే రాజ్ బి శెట్టి పండించిన విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి.

ఇక ‘అంజన ప్రకాష్’ చేసిన నటన కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా డెప్త్ తో తను నటించందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టులందరు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక సునీల్ అయితే తను చేసిన పాత్రలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకునేలా ఓ డిఫరెంట్ పాత్రనైతే ఎంచుకొని చేయడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి విషయానికి ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన క్రిస్టో జవియర్ సాంగ్స్ అంత పెద్దగా నచ్చనప్పటికీ బీజీఎంలో అక్కడక్కడ వేరియేషన్స్ అయితే చూపించాడు. ఇక ముఖ్యంగా మమ్ముట్టి యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన ఇచ్చిన బీజీయం అయితే చాలా అద్భుతంగా ఉంది… ఇక సినిమాటోగ్రాఫర్ అయిన విష్ణు శర్మ కూడా తన విజువల్స్ తో ఈ సినిమాకి గ్రాండీయర్ లుక్ ను తీసుకొచ్చాడు. ఇక మొత్తానీకైతే ఈ సినిమాని సగటు ప్రేక్షకుడు ఇష్టపడేలా చేయడంలో కెమెరా పనితనాన్ని చూపించాడు…

ప్లస్ పాయింట్స్

మమ్ముట్టి యాక్టింగ్…
కథ

మైనస్ పాయింట్స్

కొన్ని సీన్లల్లో నరేశన్ కొంచం స్లో అయింది…

సెకండాఫ్ కూడా కొంత వరకు మైనస్ అయింది..

రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చూడవచ్చు…