Kodali Nani: డిప్రెషన్ లోకి కొడాలి నాని..

పోలింగ్ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కొడాలి నాని హైదరాబాద్ వెళ్ళిపోయారు. రెండు రోజుల కిందట అనుచరులతో కలిసి నియోజకవర్గానికి చేరుకున్నారు.

Written By: Dharma, Updated On : May 24, 2024 9:13 am

Kodali Nani

Follow us on

Kodali Nani: కొడాలి నాని.. పరిచయం అక్కర్లేని పేరు. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో కలిపి ఐదోసారి పోటీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారపక్షంలో ఉన్న ఆయన స్టయిలే వేరు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబుతో పాటు లోకేష్ లపై ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేయాలో.. అంతలా చేశారు. అధినేత జగన్ పై ఈగ వాలనివ్వరు. అయితే ఈ ఎన్నికల్లో వైసిపి గెలిచే ఛాన్స్ తక్కువ అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొడాలి నాని డిప్రెషన్ కు గురైనట్లు తెలుస్తోంది. అందుకే కొంత అనారోగ్యాన్ని మూటగట్టుకున్నట్టు సమాచారం.

పోలింగ్ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కొడాలి నాని హైదరాబాద్ వెళ్ళిపోయారు. రెండు రోజుల కిందట అనుచరులతో కలిసి నియోజకవర్గానికి చేరుకున్నారు. మండలాల వారిగా రివ్యూలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన సోఫాలో కూర్చోగా.. అచేతనంగా ఉండి పోయారు. గమనించిన అనుచరులు వెంటనే వైద్యులను ఆశ్రయించారు. తీవ్ర ఒత్తిడితో అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. హైదరాబాదు నుండి హుటాహుటిన కుటుంబ సభ్యులు గుడివాడ చేరుకున్నారు. హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

రాజకీయాల్లో ఉంటే తీవ్ర ఒత్తిడికి గురికావడం సహజం. పైగా కొడాలి నాని వంటి వారు మరింత ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే ప్రత్యర్థులపై ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు కాబట్టి. ఇప్పుడు ఏమైనా ఫలితాల్లో తేడా కొడితే దాని పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రి పదవి తీసుకున్నాక.. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలకు సుపరిచితమే. అతన్ని అభిమానించే వైసీపీ శ్రేణులకు ఆ వ్యాఖ్యలు ఫ్యాషన్ గా అనిపించాయి. అటువంటి వ్యాఖ్యలకు ఫిదా అయిన అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. గెలుపోటములు తమ స్థానాలను నిర్దేశిస్తాయి. అయితే పోలింగ్ సరళి తెలుసుకునే క్రమంలో కొడాలి నాని అస్వస్థతకు గురికావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.