Homeఎంటర్టైన్మెంట్Mrithyunjay Movie Review: మృత్యుంజయ్ మూవీ రివ్యూ : థ్రిల్లర్ సినిమాల ప్రేమికులకు జై

Mrithyunjay Movie Review: మృత్యుంజయ్ మూవీ రివ్యూ : థ్రిల్లర్ సినిమాల ప్రేమికులకు జై

Mrithyunjay Movie Review: నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, బేబీ ఉహ, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, తదితరులు
సంగీత దర్శకుడు:కాల భైరవ
ఛాయాగ్రహణం: విద్యా సాగర్ చింత
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
దర్శకుడు: శ్రీ హుస్సేన్ షా కిరణ్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం & వినయ్ చిలకపాటి

తనదైన కామెడీ టైమింగ్, ఎంటర్టైనింగ్ స్టోరీలతో ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అసక్తే ఉంటుంది. కామెడీ ప్రధానంగా ఉండే సినిమాలను ఎంచుకునే శ్రీవిష్ణు ఈసారి మృత్యుంజయ్ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ రిలీజ్ నుంచే కొంచెం మిస్టరీ, థ్రిల్లర్ ఫీల్ ఇచ్చిన ఈ సినిమా నిజంగా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందనేది చూద్దాం.

మృత్యుంజయ్ (శ్రీ విష్ణు) స్వేచ్చ ఆనే న్యూస్ పేపర్ లో శ్రద్ధాంజలి యాడ్స్ తీసుకొచ్చే మార్కెటింగ్ ఉద్యోగి. రికార్డు స్థాయిలో యాడ్స్ తీసుకొచ్చి సూపర్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకుంటాడు కానీ తనకు మాత్రం క్రైమ్ బ్యూరోలోకి మారాలని, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. బాస్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఒకరోజు ఒక శ్రద్ధాంజలి యాడ్ కోసం వెళ్లిన జయ్‌ కు ఆ మరణం పై అనుమానం వస్తుంది. అది సహజ మరణం కాదని, హత్య అయి ఉంటుందని అనుమానిస్తాడు. కొన్ని రోజుల గ్యాప్ లోనే అలాంటిదే మరో మరణ వార్త వస్తుంది. దీంతో జయ్ ఆ మరణాల వెనక ఉన్న మిస్టరీని ఛేదించాలని విచారణ మొదలుపెడతాడు. ఈ మరణాల వెనక ఉన్న ఉన్న రహస్యం ఏంటి? అసలు ఎవరు ఇవన్నీ చేయిస్తున్నారు? ఇవన్నీ కనుగొనే ప్రయత్నంలో జయ్ కు ఎదురైన అడ్డంకులు ఏంటి అనేది మిగతా కథ.

సహజంగా తెలుగులో థ్రిల్లర్ లకు కూడా కమర్షియల్ హంగులు అద్దే ప్రయత్నం చేస్తారు ఫిల్మ్ మేకర్స్. కానీ ఈ సినిమాను మాత్రం వీలైనంత వరకూ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా స్క్రీన్ ప్లే కు లోబడే ప్రెజెంట్ చేయడం మెచ్చుకోవాల్సిన అంశం. ప్రథమార్థం కథలోకి వెళ్ళేందుకు కాస్త సమయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ ప్రీ ఇంటర్వల్ నుంచి సినిమా మంచి థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది. విలన్ సాధుగా నటించిన వీర్ ఆర్యన్, హీరో శ్రీ విష్ణు ల క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఏసీపీ సీత గా నటించిన రెబా మోనికా జాన్ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ నిడివి మాత్రం ఎక్కువ లేదు. శ్రీవిష్ణుకు, రెబా పాత్రకు రొమాంటిక్ ట్రాక్ పెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ తీసుకోలేదు దర్శకుడు. ఒక పక్క క్యాట్ అండ్ మౌస్ గేమ్ జరుగుతున్నప్పటికీ హీరోకు స్నేహితుల మధ్యలో వచ్చే సన్నివేశాల్లో సిట్యుయేషనల్ కామెడీ కొంతవరకూ పండింది. సాధారణ ప్రేక్షకుల సంగతేమో కానీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చుతుంది.

Also Read: సోను సూద్‌ మరో మానవతా సాయం.. గల్ఫ్‌లో చిక్కుకున్నవారికి అండగా

కాల భైరవ నేపథ్య సంగీతం బాగుంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉంది. మాస్ మూస సినిమాలు రాజ్యమేలే తెలుగులో ఇలాంటి క్లీన్ థ్రిల్లర్ ను ప్రెజెంట్ చేయాలని దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ చేసిన ప్రయత్నం మాత్రం మెచ్చుకోక తప్పదు. ఫస్ట్ హాఫ్ కొంతవరకూ సాగతీతగా అనిపించినా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గానే సాగింది. రెండు గంటలే నిడివి ఉండడం సినిమాకు ప్లస్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఓకే అనిపించే సినిమా. కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కష్టమే.

సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. నెమ్మదిగా ఫస్ట్ హాఫ్
2. సాదాసీదా కోర్ ప్లాట్

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1, శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్
2. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
3. మసాలాలు లేకుండా థ్రిల్లర్ ను ప్రెజెంట్ చేయడం

రేటింగ్: 2.5 /5

ఫైనల్ వర్డ్: థ్రిల్లర్ సినిమాల ప్రేమికులకు జై

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version