https://oktelugu.com/

Project Z Review: ప్రాజెక్ట్ జెడ్ ఫుల్ మూవీ రివ్యూ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ కుమార్ (సందీప్ కిషన్) ఒక చిల్లర దొంగని పట్టుకునే క్రమంలో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యని హత్య చేయడం చూస్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 8, 2024 / 06:58 PM IST

    Project Z Review

    Follow us on

    Project Z Review: ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ హీరోలందరిలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక హీరో సందీప్ కిషన్.. అతను హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రతిసారి ఎక్స్పెరిమెంటల్ సినిమాలని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ‘ఊరి పేరు భైరవకోన’ అనే సినిమాతో మరొక ప్రయోగాత్మకమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలను చేయడానికి తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఒక ఆరు సంవత్సరాల క్రితం సందీప్ కిషన్ హీరోగా తమిళంలో ‘మాయావన్ ‘ అనే సినిమా వచ్చింది.

    అయితే ఈ సినిమా అక్కడ మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా సందీప్ కిషన్ కి కూడా తమిళం లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసింది. ఇక దానికి సంబంధించిన సీక్వెల్ ని ఇప్పుడు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సినిమా అర్థం కావాలంటే మొదటి పార్ట్ చూసి ఉండాలి. కాబట్టి ఈ సినిమాను ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది సందీప్ కిషన్ ఖాతాలోకి మరొక సక్సెస్ వచ్చినట్టేనా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ
    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇన్స్పెక్టర్ కుమార్ (సందీప్ కిషన్) ఒక చిల్లర దొంగని పట్టుకునే క్రమంలో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యని హత్య చేయడం చూస్తాడు. ఇక దాంతో కుమార్ కి ఆ జిమ్ ట్రైనర్ కి మధ్య జరిగిన తోపులాటలో కుమార్ ఆ ట్రైనర్ ని కత్తితో పొడుస్తాడు. దాంతో ఆ జిమ్ ట్రైనర్ చనిపోతాడు. దానివల్ల సందీప్ కిషన్ కి కూడా కొన్ని దెబ్బలు తగుతాయి. కాబట్టి ఆయన గాయాలు తగ్గిన తర్వాత తనని మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ను తీసుకురావాల్సిందిగా తన పై అధికారులు కొరుతారు. దాంతో సైకోథెరపిస్ట్ అయిన అదిర (లావణ్య త్రిపాఠి) తో పరిచయం ఏర్పడుతుంది. తనతో కొద్దిరోజులు ట్రావెల్ అవుతాడు. ఇక అప్పటి నుండి వీళ్ల మధ్య ప్రేమ అనేది చిగురుస్తుంది. ఇక దీంట్లో అసలు కథ మరో యాంగిల్ లోకి వెళ్తుంది. అయితే ఆ కథ ఏంటి సందీప్ కిషన్ కి ఒక ఆర్మీ ఆఫీసర్ కి మధ్య జరగబోయే గొడవ లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సి వి కుమార్ ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠ భరితమైన స్క్రీన్ ప్లే తో నడిపించాడు. మెదడుని కాపీ చేసి ఇంకొక మనిషి మెదడులో పెట్టొచ్చా అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో ఆయన చూపించిన విజువల్స్ గాని, ఆయన సీన్స్ ను నడిపించిన విధానం గానీ, స్క్రీన్ ప్లే గాని ఏ ఒక్క ప్రేక్షకుడికి కూడా బోర్ కొట్టించదు. మొదట్లో ఆయన క్యారెక్టర్ల సెటప్ కోసం తీసుకున్న కొంత టైం మాత్రం ప్రేక్షకుడిని కొంతవరకు నిరాశ పరుస్తోంది. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చే సీన్లను చూస్తున్న కొద్ది ఆ ప్రేక్షకుడి లో తర్వాత ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక దర్శకుడు రాసుకున్న కథకి అనుగుణంగానే స్క్రీన్ ప్లే ని కూడా ఇక్కడ డివియెట్ కాకుండా ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. దానివల్ల ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్ మీద కూర్చోని చూసే విధంగా సస్పెన్స్ ను కలిగించే అంశాలతో ఒక థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను నడిపించాడు.

    ఇక సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన థ్రిల్లర్ సినిమాగా ఈ సినిమాను మనం అభివర్ణించవచ్చు. ఇక జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. అయితే ఈ సినిమాని ఆరు సంవత్సరాల తర్వాత తెలుగులో రిలీజ్ చేసినప్పటికీ ఇప్పుడు కూడా మన తెలుగు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో ఈ సినిమా చాలావరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక డిఫరెంట్ అటెంప్ట్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్తేజపరిచే సందీప్ కిషన్ ఖాతాలో ‘భైరవకోన ‘తర్వాత మరొక సక్సెస్ ఫుల్ సినిమా వచ్చి చేరిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో దర్శకుడు మాత్రం నెక్స్ట్ లెవల్ ల్లో ఉంటాయనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు తను ఎక్కడ కూడా తన క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ కోసం ఎలాగైతే రాత్రి పగలు కష్టపడి పని చేస్తాడో అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో తనను తాను కొత్తగా చుపించుకుంటు 100% క్యారెక్టర్ కి సెట్ అయ్యే విధంగా నటించి మెప్పించాడనే చెప్పాలి. ఇక లావణ్య త్రిపాఠి కూడా సందీప్ లి సహకరిస్తూ తను చేసే ఇన్వెస్టిగేషన్ లో తను కూడా తన వంతు పాత్రను పోషిస్తూ ఒక సెటిల్డ్ క్యారెక్టర్ లో నటించింది. ఇక జాకీ ష్రాఫ్ కూడా తనదైన రీతిలో వైవిద్య భరితమైన నటనను మరొకసారి చూపిస్తూ చిన్నచిన్న ఎక్స్ప్రెషన్స్ తో హావ భావాలను పండించిన విధానం చాలా కొత్తగా ఉంది. ఇక ఏ నటుడిలో కూడా అలాంటి ఒక న్యూ వర్షన్ యాక్టింగ్ అయితే కనిపించలేదు. నిజానికి జాకీ ష్రాఫ్ ఏ క్యారెక్టర్ చేసినా కూడా అందులో ఆల్మోస్ట్ జీవిస్తాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఇక మొత్తానికైతే మిగిలిన ఆర్టిస్టులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా సక్సెస్ లో ప్రతి నటుడు కూడా చాలా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి…

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి సీన్ ని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ ఆ మ్యూజిక్ ని చాలా బాగా వాడుకున్నాడు. ఇక సినిమాటోగ్రాఫర్ అయిన గోపి అమర్నాథ్ కూడా తన విజువల్స్ తో సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించారనే చెప్పాలి. ముఖ్యంగా సందీప్ కిషన్ జాకీ ష్రాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్లలో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఎడిటర్ కూడా తన పనితనాన్ని చూపిస్తూ ప్రతి సీన్ లో లెంత్ ఎక్కడి వరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంచి మిగితది కట్ చేస్తూ ఆ సినిమాని బోరింగ్గా లేకుండా ఇంట్రేస్టింగ్ గా ఉండే విధంగా మార్చాడనే చెప్పాలి…ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    కథ స్క్రీన్ ప్లే, డైరెక్షన్..
    కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు..
    సందీప్ కిషన్ యాక్టింగ్…

    మైనస్ పాయింట్స్

    మధ్య లో కొన్ని సీన్లు బోరింగ్ గా అనిపించాయి.
    క్లైమాక్స్ చాలా తొందర క్లోజ్ చేశారు…

    రేటింగ్
    ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చూడవచ్చు…