https://oktelugu.com/

Love Marriage : కూతురి ప్రేమ వివాహం.. తట్టుకోలేక ఈ తండ్రి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కొద్దిరోజులుగా అనూష తన వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో చెప్పకుండా పారిపోయి తను ఇష్టపడిన వాడితో గుడిలో పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి మురళి ఒకసారిగా నిశ్చేష్టుడయిపోయాడు. గుండెలు అవిసేలా రోదించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2024 / 09:06 PM IST

    Daughter Love Marriage

    Follow us on

    Love Marriage : ఒక్కగానొక్క కూతురు.. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆర్థిక స్తోమత సహకరించకపోయినప్పటికీ కష్టపడి చదివించాడు. ఆ అమ్మాయి కూడా మొన్నటిదాకా చదువుల తల్లి సరస్వతి లాగా చదివింది. కూతురు ఎదుగుతుంటే.. ఆమెలో తనను చూసుకున్నాడు ఆ తండ్రి.. ఆమె ఉన్నత చదువులు చదువుతుంటే గర్వపడ్డాడు. మరికొద్ది రోజుల్లో తన చేతికి వస్తుందని.. తన ఆశలను సాధిస్తుందని పొంగిపోయాడు. తన కూతురి గురించి నలుగురిలో గొప్పగా చెప్పుకున్నాడు. చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడ్డ తర్వాత ఓ అయ్య చేతిలో పెట్టాలని అనుకున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్టు.. ఆ తండ్రి ఒకటి కోరుకుంటే.. ఆ కూతురు మరో పని చేసింది.. ఫలితంగా ఆ తండ్రి గుండె ముక్కలైంది.

    తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోయింది..

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి స్థానికంగా ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఇతడికి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు చిలువేరి అనూష.. ప్రస్తుతం ఆమె డిగ్రీ దాకా వచ్చింది.. స్థానికంగా ఓ కళాశాలలో చదువుతోంది.. తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ మురళి తన కూతురు అనూషను మంచి చదువులు చదివిస్తున్నాడు. అయితే అనూష తన తండ్రి ఆశలను సాధించాల్సింది పోయి ఓ యువకుడి ప్రేమలో పడింది. కొద్దిరోజులుగా అనూష తన వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో చెప్పకుండా పారిపోయి తను ఇష్టపడిన వాడితో గుడిలో పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి మురళి ఒకసారిగా నిశ్చేష్టుడయిపోయాడు. గుండెలు అవిసేలా రోదించాడు.

    తట్టుకోలేక..

    అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలాంటి పని చేయడంతో ఒక్కసారిగా మురళి ఆందోళనలో కూరుకుపోయాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకొని తన పరువు తీసిందని.. ఇక ఆమె నా దృష్టిలో చనిపోయినట్టేనని.. చావు ఫ్లెక్సీ ఇంటి ముందు ఏర్పాటు చేశాడు. తన భార్యతో కలిసి ఆ ఫ్లెక్సీ ఎదుట విలపించాడు..”నేను ఎంతగానో ప్రేమించి పెంచిన నా బిడ్డ నన్ను మోసం చేసింది. ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. నా పరువు గంగలో కలిసిపోయింది. నా పరువును ఇంతమంది ముందు తీసిన నా కూతురు చనిపోయినట్టే లెక్క” అంటూ గుండెలు బాదుకుంటూ రోధించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకాలం సృష్టించింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అనుష క్షణకాలపు ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి పోయిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.