Most Eligible Bachelor: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా వస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor). అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘లెహరాయి’ అనే రొమాంటిక్ సాంగ్ ప్రస్తుత సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అతి తక్కువ టైంలోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ను సాధించింది.
ఇప్పటివరకు ఈ లిరికల్ వీడియోకి 4 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ గీతాన్ని, టాలెంటెడ్ లిరికల్ రైటర్ శ్రీమణి చాలా చక్కగా రచించారు. అలాగే సిధ్ శ్రీరామ్ కూడా చాలా గొప్పగా ఈ పాటను ఆలపించారు.
పైగా ఈ పాటలో అఖిల్, పూజా హెగ్డే (Pooja Hegde) కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా అఖిల్ కి భారీ హిట్ ఇవ్వాలనే కసితో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ హిట్ కోసం పూజా హెగ్డే కూడా బికినీ వేసి మరీ పరిధి దాటి మరీ నటిస్తోంది.
ఈ సినిమాలో రెండు రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. కాగా పూజా హెగ్డేతో రొమాన్స్ కి హిట్ గ్యారంటీ అని, ఈ సాంగ్స్ లో పూజా హెగ్డే గ్లామర్ కోసమైనా యూత్ ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకంతో ఉంది టీమ్. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు, వాసువర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Most eligible bachelor akhil poojas chemistry is unmissable
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com