
యువ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగవుతంది. కొన్ని రోజుల ముందు బైక్ యాక్సిడెంట్ గురై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయి ధరమ్ ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడాయన సొంతంగానే శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇతరులతోతేజ్ మాట్లాడుతున్నారని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చునని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
వినాయక చవితి రోజు రాత్రి ఎనిమితి గంటలకు సాయితేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి అందరికి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జ్-ఐకియూ మార్గంలో బైక్ పై వేంగంగా వెళుతున్న క్రమంలో బైక్ స్కిడ్ అయి సాయి ధరమ్ తేజ్ గాయపడ్డాడు. వెంటనే ఆయనను మెడికవర్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అనంతరం అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేశారు. ప్రత్యేక వైద్య బృందం సాయి తేజ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. దాదాపు పది రోజులు వెంటిలేటర్ పై ఉన్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడింది.
ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. సాయి ధరమ్ ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని, ఇప్పుడు సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో సాయిధరమ్ డిశ్చార్జ్ కానున్నట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుండగా, ఇందులో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.