Janatha Garage: జనతా గ్యారేజ్ మూవీ లో మోహన్ లాల్ పాత్ర కోసం ముందుగా అనుకున్నది ఆ స్టార్ హీరోనే..?

శివ డైరెక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి మెప్పించాడు.

Written By: Gopi, Updated On : January 2, 2024 12:44 pm

Janatha Garage

Follow us on

Janatha Garage: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను అయితే సంపాదించుకోవడానికి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి మెప్పించాడు.

అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్ర కోసం మొదటగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని భావించారట కానీ తను రీఎంట్రీ సినిమాలో బిజీగా ఉండడం వల్ల తనని ఆ సినిమాలోకి తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేయలేదు. మొదటగా కొరటాల ఈ కథ రాసుకున్నప్పుడు ఎన్టీఆర్ ని ఉద్దేశించి రాసుకున్నాడంట మోహన్ లాల్ పాత్ర మాత్రం చిరంజీవి ని అనుకున్నాడు కానీ ఆ కథను మాత్రం తర్వాత చిరంజీవికి చెప్పలేదు. తెలుగులో కొంతమంది హీరోలను అనుకున్నప్పుటికి వాళ్ళు ఎవరు సెటవ్వరు అయితే చిరంజీవి లేకపోతే మోహన్ లాల్ ఇద్దరు మాత్రమే ఆ క్యారెక్టర్ ని చేయగలరు అని కొరటాల శివ భావించి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆయనకి స్టోరీ చెప్పలేదు.

అందుకే ఆ పాత్ర కి మోహన్ లాల్ ని తీసుకున్నారు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో మోహన్ లాల్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది.అయితే మోహన్ లాల్ చేసిన పాత్రకి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పాత్రకి చిరంజీవి అయితే చాలా బాగుండేది అని డైరెక్టర్ అనుకున్నప్పటికీ అది మాత్రం వర్కౌట్ అవలేదు. ఒకవేళ మోహన్ లాల్ చేసిన ఆ పాత్ర ని చిరంజీవి కనక చేసి ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లు బ్రేక్ చేసి ఉండేదని చాలా మంది అభిమానులు వాళ్ల అభిప్రాయాలని వెల్లడించారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ గత రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది.

మొత్తానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకపోయిన కూడా ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబో లో రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునేలా చేసింది. ఇక స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేసే విధంగా ఈ సినిమా అందర్నీ మెప్పించింది…