Hangover: న్యూఇయర్ మందు పార్టీలతో హ్యాంగోవరా.. ఇవి తింటే దెబ్బకు దిగిపోతుంది!

ఆల్కహాల్‌ తాగడం వల్ల శరీరంలోని లిక్విడ్స్‌ బ్యాలెన్స్‌ చేసే మినరల్స్‌ అయిన నీరు, ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోవడం జరుగుతుంది. హ్యాంగోవర్‌ నుంచి కోలుకోవడానికి, బాడీని హైడ్రేట్‌ చేసుకోవాలి, ఎలక్ట్రోలైట్లను రిస్టోర్‌ చేసుకోవాలి.

Written By: Raj Shekar, Updated On : January 2, 2024 12:49 pm

Hangover

Follow us on

Hangover: నూతన సంవత్సరం వేడుకలకు, వీకెండ్‌ కలిసి రావడంతో ఈ ఏడాది సెలబ్రేషన్స్‌ అంబరాన్ని తాయాయి. మందు, విందు, చిందుతో యావత్‌ ప్రపంచం ఆంగ్ల సవంత్సరాదిని ఘనంగా జరుపుకుంది. న్యూ ఇయర్‌ వేళ, డిసెంబర్‌ 31 నైట్‌ చాలా మంది ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకున్నారు. ఫుల్లుగా మద్యం సేవించారు. జనవరి 1న ఇలా మద్యం తాగినవారంతా తలలు పట్టుకున్నారు. హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడ్డారు, కొంతమంది మళ్లీ ఒకటి రెండు పెగ్గులేశారు. కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. హ్యాంగోవర్‌ డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. హ్యాంగోవర్‌ నుంచి బయట పడేందుకు యత్నిస్తున్నారు. అయితే హ్యాంగోవర్‌ ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చాలా మందికి తెలియదు. ఈ ఆరు ఫుడ్స్‌ తీసుకుంటే హ్యాంగోవర్‌ దెబ్బకు దిగిపోతుందని పేర్కొంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం.

హైడ్రేటింగ్‌ డ్రింక్స్‌
ఆల్కహాల్‌ తాగడం వల్ల శరీరంలోని లిక్విడ్స్‌ బ్యాలెన్స్‌ చేసే మినరల్స్‌ అయిన నీరు, ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోవడం జరుగుతుంది. హ్యాంగోవర్‌ నుంచి కోలుకోవడానికి, బాడీని హైడ్రేట్‌ చేసుకోవాలి, ఎలక్ట్రోలైట్లను రిస్టోర్‌ చేసుకోవాలి. దీని కోసం స్పోర్ట్స్‌ డ్రింక్స్, కోకోనట్‌ వాటర్, ఎలక్ట్రోలైట్‌–ఎన్‌హ్యాన్స్‌డ్‌ డ్రింక్స్‌ వంటివి తీసుకోవచ్చు. సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్న డ్రింక్స్‌ కూడా తాగుతుండాలి.

మంచినీరు..
పైన పేర్కొన్న డ్రింక్స్‌లో ఏదీ లేకుంటే, నీరు తాగవచ్చు. నెమ్మదిగా, చిన్న సిప్స్‌ మాత్రమే తీసుకోవాలి. అతిగా లేదా చాలా వేగంగా తాగితే, వాంతులు కావచ్చు. అలాగే, చాలా చల్లటి నీటిని తాగొద్దు. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగించి పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మార్చవచ్చు.

పండ్లు..
హ్యాంగోవర్‌ నుంచి కోలుకోవడానికి పండ్లు తినొచ్చు. పండ్లలోని నేచురల్‌ షుగర్స్‌ బాడీలోనుంచి ఆల్కహాల్‌ త్వరగా ఎలిమినేట్‌ అయ్యలా చేస్తాయి. ఆరోగ్యాన్ని, హైడ్రేషన్‌ను పెంచే విటమిన్లు, నీరు, పోషకాలు ఫ్రూట్స్‌లో సమృద్ధిగా లభిస్తాయి. మామిడిపండ్లు, ద్రాక్ష, నారింజ, బేరి, అరటిపండ్లు, పుచ్చకాయ హ్యాంగోవర్‌ను సమర్థవంతంగా దూరం చేయగలవు.

లైట్‌ ఫుడ్స్‌..
కడుపు నొప్పి, విరేచనాలు లేదా వికారం ఉంటే, చప్పగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినవచ్చు. వీటిని బీఆర్‌ఏటీ డైట్‌ అంటారు, ఇందులో అరటి, రైస్, యాపిల్సాస్, టోస్ట్‌ వంటి ఫుడ్స్‌ ఉంటాయి.

అల్లం..
అల్లం హ్యాంగోవర్‌ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. దీన్ని వివిధ రూపాల్లో తినవచ్చు లేదా తాగవచ్చు, కానీ జింజర్‌ ఆలే లేదా అల్లం బీర్‌ వంటి చక్కెర, జిగట డ్రింక్స్‌ సేవించకూడదు. బదులుగా నిజమైన అల్లం ఎంచుకోవాలి.

సాల్మన్‌..
ఆల్కహాల్‌ శరీరంలోని విటమిన్లు, ముఖ్యంగా బీ6, బీ12ని తగ్గిస్తుంది. ఈ విటమిన్లు మళ్లీ పొందితే హ్యాంగోవర్‌ నుంచి బయటపడవచ్చు. కొందరు వ్యక్తులు హ్యాంగోవర్లను నయం చేయడానికి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకుంటారు, కానీ అవి పని చేయవు. ఈ విటమిన్లు ఉన్న ఆహారాన్ని తినడం మంచి మార్గం. సాల్మన్‌ ఒక గొప్ప ఎంపిక. ఇందులో బీ6, బీ12, అలాగే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

తినకూడని ఆహారాలు ఇవీ..
హ్యాంగోవర్‌ను నివారించడానికి బర్గర్లు, ఫ్రై స్, కాఫీ వంటి డ్రింక్స్‌ కొందరు తీసుకుంటుంటారు. వీటిని ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్‌ ఐటమ్స్‌ హ్యాంగోవర్‌ లక్షణాలను మరింత తీవ్రతరంగా మారుస్తాయి.