Ram Charan Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే బుచ్చిబాబు డైరెక్షన్ లో ఆయన చేస్తున్న ఆర్ సి 16 సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గా మైసూర్ లో జరిగిన షెడ్యూల్ ను భారీగా ప్లాన్ చేసిన బుచ్చిబాబు ఈ షెడ్యూల్లో కొన్ని పవర్ ఫుల్ సీన్స్ తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో మీర్జాపూర్ సిరీస్ లో మున్నాభాయ్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘దివ్యేందు ‘ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మొత్తానికైతే మున్నాభాయ్ యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడికి సుపరిచితుడే తన డైలాగులతో మీర్జాపూర్ సిరీస్ ను ఒక రేంజ్ కి తీసుకెళ్లిన ఆయన ప్రస్తుతం ఈ సినిమాలో నటించడం పట్ల మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా వరకు ఆనంద పడుతున్నారు. ఇక మొత్తానికైతే బుచ్చిబాబు ఈ సినిమాతో భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమా కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతవరకు గుర్తింపు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంలో రామ్ చరణ్ నటించినట్టుగా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇక కథాపరంగా గ్రిప్పింగ్ రాసుకున్న బుచ్చిబాబు ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది తెలియాల్సింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో బుచ్చిబాబు కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇందులో జగపతిబాబు కన్నడ సూపర్ స్టార్ అయిన శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ ని సాధిస్తే ఇటు బుచ్చిబాబుకు, అటు రామ్ చరణ్ కు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది…