Chiranjeevi : దాదాపు 45 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఏకైక హీరో చిరంజీవి… ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ ఏజ్ లో కూడా విశ్వంభర లాంటి సినిమాతో భారీగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక తను చేస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కెరీయర్ ను మార్చేసిన సినిమాగా మనం ఖైదీ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ సినిమాని మొదట వేరే హీరోలతో చేయాలనే ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికి అప్పుడప్పుడే స్టార్ హీరోగా మారుతున్న చిరంజీవితో చేస్తే బాగుంటుందని దర్శకుడు కోదండరామిరెడ్డి భావించి మొత్తానికైతే ఈ సినిమాతో కోదండరామిరెడ్డి భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాను చిరంజీవి కెరియర్ ను మలుపు తిప్పిన సినిమాగా కూడా చెప్పుకుంటూ ఉంటారు.
ఇక నిజానికి ఈ సినిమాలో చిరంజీవి తప్ప వేరే ఏ హీరో చేసిన కూడా ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించేది కాదు. అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్లైతే చేశారు. ఇక అప్పటినుంచి మెగాస్టార్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక అప్పుడు మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతుండటం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా చాటడానికి విశ్వం భర సినిమా చేస్తున్నారు. చిరంజీవి ఈ ఏజ్ లో కూడా పాన్ ఇండియా సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.
70 సంవత్సరాల వయసులో కూడా చాలా రిస్క్ చేస్తూ ఆయన భారీ సినిమాలను చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా తనను తాను స్టార్ హీరోగా మార్చుకున్న ఈ మెగాస్టార్ తన తర్వాత తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో సక్సెస్ సాధించాడు. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు అయితే ఉంది…