Homeఎంటర్టైన్మెంట్Megastar Shocking Review On RRR: 'ఆర్ఆర్ఆర్' పై మెగాస్టార్ ...

Megastar Shocking Review On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మెగాస్టార్ షాకింగ్ రివ్యూ

Megastar Shocking Review On RRR: తెలుగు వెండితెరపైనే బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. అందుకే.. ఈ సినిమా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది ‘ఆర్ఆర్ఆర్’ . రాజమౌళి బృందం రికార్డు స్థాయి సక్సెస్ సాధించడం పై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

Megastar Shocking Review On RRR
Megastar Shocking Review On RRR

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ మాటల్లో.. ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోనే కాదు, ప్రేక్షకుల గుండెల్లో కూడా దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సృష్టిస్తున్న భారీ విజయాల గురించి వింటూ ఉన్నాను. రాజమౌళి వండర్ ఫుల్ విజన్ కి ఈ విజయం ఒక నిదర్శనం.

Also Read: RRR Fans Dies In Accident: ముగ్గురి ప్రాణం తీసిన త్రిపుల్ ఆర్ బెన్ ఫిట్ షో.. రోడ్డు ప్ర‌మాదంలో దారుణం

మెగాస్టార్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘బాయ్స్ ఇద్దరూ (ఎన్టీఆర్ – చరణ్) పోటీ పడి నటించారు. వాళ్ళిద్దర్నీ ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే.. నాకే అసూయ కలిగింది. తారక్.. నీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మై బాయ్ చరణ్ చించేశాడు. ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుంటుంది అని నేను ముందే ఊహించాను. అయినా ఫ్యాన్స్ కి కావలసింది ఇది కదా. రాజమౌళి విధ్వంసం సృష్టించాడు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

Megastar Shocking Review On RRR
Megastar Shocking Review On RRR

ఏది ఏమైనా ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ – చరణ్ తమ పవరేంటో సినిమా వసూళ్ల ద్వారా ఘనంగా నిరూపించారు. ఈ సినిమా భారీ విజయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా పండుగ చేసుకుంటున్నారు. మరి ముందు ముందు ‘ఆర్ఆర్ఆర్’ ఇక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper