samantha – pritam: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటి చైతన్య సమంత గురించి గత కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమేనని అక్టోబర్ రెండవ తేదీ చైతన్య సమంత తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా వీరిద్దరు విడాకుల విషయం గురించి అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే సమంత చైతన్య విడిపోవడానికి కారణం ఏంటి అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా చాలామంది సమంత తన డిజైనర్ ప్రీతమ్ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినబడుతున్నాయి. సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణం ప్రీతమ్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించడంతో ఈ వార్తలపై సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పందిస్తూ వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సాధన సింగర్ స్పందిస్తూ సమంత ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారని..ప్రీతమ్ సమంతను అక్క (జీజీ) అని పిలిచే వాడిని..జీజీ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి అంటూ ఈ సందర్భంగా సాధన సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాధన సింగ్ స్పందిస్తూ నాకు షూటింగ్ లేకపోవడంవల్ల ఆ భగవంతుడు ఇచ్చిన కొంత తెలివితో ఈ విషయాన్ని ఎంతోమంది తెలివి లేని వారికి షేర్ చేస్తున్నాను అంటూ ఈమె తెలియజేశారు. ప్రస్తుతం సమంత -ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి సాధన సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.