
America-China: మూడో ప్రపంచ యుద్ధంపై కొద్ది రోజులుగా అందరిలో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ మానవాళి నాశనానికి యుద్ధాలే పునాది అని తెలుసుకున్నాం కదా. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో ప్రపంచం ఎంత మూల్యం చెల్లించిందో తెలిసిందే కదా. అంతటి వినాశనం జరుగుతుందనే భయంతోనే ఇన్నాళ్లు యుద్ధం వద్దని వారిస్తున్నాం. కానీ దుందుడుకు చర్యలతో చైనా లాంటి దేశాలతో ఆ తతంగం జరిగేలా కనిపిస్తోంది. దాయాది దేశాలపై కవ్వింపు చర్యలతో ఉడికిస్తున్న చైనా కుట్రలను అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ తన వాపును చూసి బలుపులా భావించుకుంటోందని తెలిసినా కుట్రలు మాత్రం మానడం లేదు.
తైవాన్ గగనతలంలో చైనా విమానాలతో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ దేశం భయాందోళన వ్యక్తం చేస్తోంది. తైవాన్ భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఇండియా అభివృద్ధ సాధిస్తుందని భావించి తైవాన్ ను ఇరుకున పెట్టే క్రమంలో దానిపై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర జేస్తోంది. డ్రాగన్ దూకుడును తగ్గించే క్రమంలో దానికి ముక్కుతాడు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా యుద్ధం జరిగితే ప్రపంచ వినాశనమే జరుగుతుందని పలువురు శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో చైనాతో యుద్ధం చేసే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో ఇక ఎంత మాత్రం ఉపేక్షించినా లాభం లేదని సూచిస్తున్నారు. డ్రాగన్ కు సరైన సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాలో బలహీన ప్రభుత్వం ఉండడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారుల సమావేశం స్విట్జర్లాండ్ లో జరగనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అఫ్గనిస్తాన్ విషయంల కూడా అమెరికా పెద్ద తప్పిదం చేసింది. అక్కడి నుంచి తన సేనలను వెనక్కి రప్పించడం ఘోరమైన నేరం. దీంతో అక్కడ ప్రస్తుతం తాలిబన్ల ఆధ్వర్యంలో రాక్షస పాలన సాగుతుందని అన్నారు. బైడెన్ నిర్వాకంతోనే ప్రపంచ మానవాళి నష్టపోతుందని దుయ్యబట్టారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే.