Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో మహేష్ బాబు లాంటి నటుడు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ గుర్తింపును సంపాదించుకొని ప్రపంచంలోనే మంచి హీరోగా పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ని కూడా అత్యంత రహస్యంగా షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సెకండ్ షెడ్యూల్లో మహేష్ బాబు(Mahesh Babu) కు సంబంధించిన కొన్ని ఎలివేషన్ సీన్స్ ని తెరకెక్కించే పనుల్లో రాజమౌళి (Rajamouli) బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా నాని (Nani) హీరోగా నటించిన హిట్ 3 (Hit 3) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రాజమౌళి ఆ ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇక ఆ ఈవెంట్ లో నాని రాజమౌళి ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన షూట్ నుంచి డైరెక్ట్ గా అయితే వచ్చారు అని చెప్పడంతో మహేష్ బాబు సినిమా షూట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తలుచుకుంటే ఈ సినిమాని చాలా తొందరగా ఫినిష్ చేయగలడు.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
కానీ ఆయనకు ఉన్న ఎక్విప్ మెంట్ మొత్తం తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆయన అనుకున్న షాట్ ను అనుకున్నట్టుగా తెరకెక్కిస్తూ ఉంటారు. అందువల్లే ఆ పాట షూట్ కి కావాల్సిన మొత్తం మెటీరియల్ ను తెప్పిస్తున్నారట. అందువల్లే ఈ షూట్ లేట్ అవుతుంది.
ఆయన ప్రతి షాట్ ను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరగకుండా చాలా పర్ఫెక్ట్ గా షట్ చేస్తూ ఉంటాడు. అందువల్లే అవి థియేటర్లో చాలా వరకు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబుకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు కాబట్టే ఆయన షూట్ చేసే ప్రతి సీన్ హైలెట్ గా నిలుస్తోంది అంటూ సినిమా వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ షెడ్యూల్లో మహేష్ బాబు ఇంకా పాల్గొన్నట్టుగా లేడు. తొందర్లోనే ఆయన ఈ షెడ్యూల్లో పాల్గొని షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. 20 రోజులపాటు ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!