‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు సూర్యుడు మేషరాశిలో ఉండడంవల్ల శశి ఆదిత్య యోగం ఏర్పడింది. దీంతో కొందరి వ్యాపారులకు అధికంగా లాభాలు ఉండనున్నాయి. మరికొందరు ఉద్యోగులు లాభపడమన్నారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు. సీనియర్ల మద్దతుతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలకు వెళ్తారు. పెద్దల సలహాతో వ్యాపారులు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. పెండింగ్లో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
మనంమిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈ రోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. ఉన్నత స్థాయి అధికారుల నుంచి మద్దతు పొందుతారు. శత్రువులపై ఆధిపత్యాన్ని చలాయిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి. ఆర్థికంగా ప్రణాళికలు వేసుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విదేశాలనుంచి విచారకరమైన వార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వ్యాపారులు ఇల్లు ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను చక్కబెడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించని లాభాలు పొందుతారు. అనుకోకుండా పర్యటనలు చేస్తారు. ఖర్చులకు దూరంగా ఉండాలి. పెండింగ్ సమస్యల నుంచి బయటపడతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభాలు తీసుకొస్తాయి. ఆదాయం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అదనపు ఖర్చులు ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఆ ఈరోజు అనేక రంగాల్లో కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొత్త వ్యక్తులతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. తమ పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు మిశ్రమ లాభాలు పొందుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఆర్థికంగా బలబడేందుకు కొత్త ప్రణాళికలు వేస్తారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రశంసలు అందుతాయి. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారి వ్యాపారం బాగా సాగుతోంది. ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో ఊహించని మార్పు జరుగుతాయి. ఆరోగ్యం బలహీనంగా మారే అవకాశం ఉంది. తెలియని వివాదాల్లో చిక్కుకోవద్దు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వారు స్నేహితులతో ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు ఒత్తిడి నుంచి బయటపడతారు. అదనపు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వ్యాపారులు కొత్త వ్యక్తులను నమ్మద్దు. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో ముందు వెనుక ఆలోచించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. కోర్టు కేసుల వ్యవహారాలు కొలికి వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.