Mahesh Babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను ఒడిశాలో మొదలు పెట్టుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండవ షెడ్యూల్ ని అతి త్వరలోనే ప్రారంభించుకోనుంది. ఈ షెడ్యూల్ వర్క్ షాప్ నాన్ స్టాప్ గా హైదరాబాద్ లో జరుగుతుంది. మధ్యలో చిన్న బ్రేక్ దొరకడం తో మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాడు. రీసెంట్ గానే తిరిగి వచ్చిన మహేష్ బాబు వర్క్ షాప్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. ప్రతీ షెడ్యూల్ పూర్తి అయ్యాక, తదుపరి షెడ్యూల్ కోసం కచ్చితంగా వర్క్ షాప్ నిర్వహించాల్సిందే అట. #RRR , బాహుబలి సిరీస్ లకు కూడా రాజమౌళి ఈ రేంజ్ లో చెక్కడం చూడలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!
ఇకపోతే రెండవ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారట. అందుకోసం నీటి సెటప్ ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. నీటిలో బోట్ ప్రయాణిస్తున్న సమయంలో మహేష్ బాబు 3000 మంది ఆర్టిస్టులతో పోరాటం చేసే సన్నివేశాన్ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తారట. ఈ బోట్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ కూడా ఉంటారట. వీళ్లిద్దరు సినిమాలో విలన్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో ఈ పోరాట సన్నివేశం చిత్రీకరణ మొదలు పెడితే జూన్ నెల వరకు కొనసాగుతుందట. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ సీక్వెన్స్ ని చిత్రీకరించబోతున్నారు. ఒక్క సన్నివేశం చిత్రీకరణ కోసం నెల రోజుల సమయం తీసుకుంటున్నారంటే ఏ రేంజ్ లో ఈ సినిమాని తీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మాత KS రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం పూర్తి చేసి, ఎట్టిపరిస్థితి లో ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారని టాక్. మిగిలిన సినిమాల లాగ కాకుండా ఈ చిత్రాన్ని కేవలం ఒక్క పార్ట్ లోనే ఫినిష్ చేస్తారట. సీక్వెల్స్ లాంటివి ఏమి ఉండవట. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. త్వరలోనే అమెజాన్ ఫారెస్ట్ లో మరియు ఇతర ఆఫ్రికా అడవుల్లో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. మహేష్ ఈ సినిమా కోసం స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. అడవి లో మాట్లాడే కోయ భాషలో కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడట. ఇంతటి డెడికేషన్ మహేష్ తన కెరీర్ లో పెట్టడం ఇదే తొలిసారి.
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కృష్ణ సీన్ ను రీక్రియేట్ చేస్తున్నారా..?