Rajamouli : దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ వరుస విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించమే కాకుండా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేశాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తోంది. అందుకే ఆయనకి ఇండియాలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు లాంటి నటుడి దొరికితే ఒక భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేసి సూపర్ సక్సెస్ ను సాధించవచ్చు కానీ రాజమౌళి మాత్రం డిఫరెంట్ గా ఆయన నుంచి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మించి ప్రేక్షకుడిని ఆకట్టుకొని భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న రాజమౌళి రెండో షెడ్యూల్ మీద తన పూర్తి ఫోకస్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి ఈ సినిమా కోసం తను రెమ్యునరేషన్ కాకుండా పర్సంటేజ్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్ కంటే రెండింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రాజమౌళి!
మొత్తానికైతే రాజమౌళి ప్రతి సినిమా విషయంలో కూడా పర్సంటేజ్ తీసుకుంటూ ఉంటాడు. మరి ఈ సినిమా విషయంలో కూడా అదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నప్పటికి దాంతోపాటుగా ఈ సినిమాని ఒక ఏరియాలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి దీని వల్ల రాజమౌళికి లాభం వస్తుందా? నష్టం వస్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఒకవేళ రాజమౌళికి కనక నష్టం వస్తే ఆయనే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అది కాకుండా లాభాలు వస్తే మాత్రం విపరీతమైన లాభాలను ఆర్జించే అవకాశం కూడా ఉంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఒక ఏరియాకి డిస్ట్రిబ్యూటర్ గా మారబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది కనక ప్రాపర్ గా వర్కౌట్ అయితే ఆయనకు కొన్ని వందల కోట్లు లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటు మరి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు.
Also Read : రాజమౌళి చేసిన సినిమాల్లో డివైడ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు ఇవేనా..?