https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 సినిమాకు తప్పని రీ షూట్లు…కారణం ఏంటి..?

Pushpa 2: 'గంగాలమ్మ తల్లి జాతర' ఫైట్ ని బేస్ చేసుకొని వదిలిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఇక దాంతో పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకులందరిలో ఒక్కసారిగా మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 7, 2024 / 10:20 AM IST

    What is the reason for the re-shoot of Pushpa 2

    Follow us on

    Pushpa 2: సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని రూపొందిస్తున్నారు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

    అలాగే ‘గంగాలమ్మ తల్లి జాతర’ ఫైట్ ని బేస్ చేసుకొని వదిలిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఇక దాంతో పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకులందరిలో ఒక్కసారిగా మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ అంత సాటిస్ఫైడ్ గా లేనట్టుగా తెలుస్తుంది.

    Satyabhama: సత్యభామ ట్విట్టర్ టాక్: పోలీస్ రోల్ లో కాజల్ విధ్వసం, ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే?

    అందుకోసమే సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలి. కాబట్టి ఏ చిన్న తప్పు జరగకుండా తను ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కనివిని ఎరగని రీతిలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టే విధంగా తీర్చి దిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా 1500 కోట్ల వరకు కలెక్షన్స్ సాధిస్తుందని ముందుగానే సినిమా మేకర్స్ మంచి అంచనాలైతే వేసుకున్నారు.

    Kanguva: రోజు రోజుకి అంచనాలు పెంచుతున్న కంగువ మూవీ…రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    అయితే పుష్ప సినిమాకి కూడా చాలావరకు రీ షూట్ అయితే చేశారు. ఇక ఇది తెలుసుకున్న కొంతమంది ట్రేడ్ పండితులు సైతం పుష్ప 2 సినిమాని మళ్లీ పుష్ప సినిమా మాదిరిగానే చేస్తారా ఏంటి అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. కాబట్టి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుంది అనేది తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే…