https://oktelugu.com/

Sandeep Reddy Vanga: ఇప్పుడే కాదు సందీప్ రెడ్డి వంగ ను మించిన డైరెక్టర్లు ఇంకా మీదట కూడా రాలేరా..?

Sandeep Reddy Vanga: ఇక ఇంతకుముందు రన్బీర్ కపూర్(Ranbir Kapoor) తో చేసిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాన్ ఇండియాలో తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

Written By: , Updated On : June 7, 2024 / 02:07 PM IST
Directors beyond Sandeep Reddy Vanga cant even come

Directors beyond Sandeep Reddy Vanga cant even come

Follow us on

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి(Arjun Reddy) లాంటి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా… ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాలను చేయడమే కాకుండా స్టార్ హీరోలందరు తనతో సినిమాలు చేయాలని కోరుకునే రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్'(Spirit) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఇంతకుముందు రన్బీర్ కపూర్(Ranbir Kapoor) తో చేసిన అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాన్ ఇండియాలో తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ను మించిన దర్శకుడు మరొకరు లేరు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక రాజమౌళిని మినహాయిస్తే ఇండియాలో సందీప్ రెడ్డి వంగ ను మించిన దర్శకుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో అయితే మరొకరు లేరు అనేది వాస్తవం..

Also Read: Nani Heroine: అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నాని హీరోయిన్… ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా?

ఎందుకంటే ఆయన ఇన్నవేటివ్ థాట్స్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడమే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా మూడు గంటల పాటు ఎంగేజ్ చేయడంలో తను చాలా వరకు సక్సెస్ అవుతున్నాడు. అందుకే డైరెక్టర్ అంటే సందీప్ రెడ్డి వంగ లాగ ఉండాలి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే సందీప్ ఇప్పుడు ఒక పేరు కాదు ఒక బ్రాండ్ గా మారిపోయాడు. ఇక బాలీవుడ్ హీరోలైతే తనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.

Also Read: Star Director Wife: ఈ ఫోటోలో ఉన్నది హీరోయిన్ కాదు..ఒక స్టార్ డైరెక్టర్ భార్య… ఇంతకీ ఈమె ఎవరంటే..?

ఇక ఇప్పటికే షాహిద్ కపూర్, రన్బీర్ కపూర్ లకు అదిరిపోయే బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందించిన తను ప్రస్తుతం ప్రభాస్ కి కూడా అదే రేంజ్ లో సక్సెస్ ని ఇవ్వాలని చూస్తున్నాడు. మరి బాలీవుడ్ హీరోలు తన వెంట పడుతున్నా కానీ ఆయన ఎందుకు వాళ్ళను పట్టించుకోవడం లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అనిమల్ సినిమా మీద బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది నెగిటివ్ ప్రచారం అయితే చేశారు. అయిన కూడా వాటి వేటికి తగ్గకుండా సినిమా సూపర్ సక్సెస్ అయింది…