https://oktelugu.com/

Rajamouli: మహేష్ బాబు రాజమౌళి మూవీ ఫస్ట్ అప్డేట్ వచ్చేది అప్పుడేనా..? ఎందుకింత ఆలస్యం..?

సినిమా అంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటుంది. దానికోసం ప్రాణం పెట్టి వర్క్ చేస్తూ ఉంటారు. ఇక అందులో రాజమౌళి ఒకరు. ఇప్పటి వరకు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 10:34 AM IST

    Mahesh-Rajamouli Movie

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ని పెంచిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన బాహుబలి సినిమాతోనే ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ ప్రపంచ స్థాయికి విస్తరించిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇండియాలోనే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన 1500 కోట్ల భారీ బడ్జెట్ తో మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన సినిమాగా కూడా తెరకెక్కబోతుందని రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక క్లూ ని కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలను మాత్రం రాజమౌళి చాలా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కారణం ఏంటి అనేది తెలియదు కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒక ప్రెస్ మీట్ ని పెట్టి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.

    సినిమా స్టోరీ ఏంటి? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలను కనక రాజమౌళి చెప్పినట్లయితే మహేష్ బాబు అభిమానులందరూ పండగ చేసుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి రాజమౌళి మాత్రం దాదాపు సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టు ఉంటుంది అంటూ చెబుతూ వస్తున్నాడు.

    అంతే తప్ప ఇప్పటివరకు సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ ను గాని, లేదంటే సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిమీద ఒక క్లారిటీ గాని ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అంటూ మహేష్ బాబు అభిమానులు రాజమౌళి మీద కొంతవరకు తీవ్రమైన కోపంతో ఉన్నారు. అయినప్పటికీ రాజమౌళి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన పర్ఫెక్షన్ మాత్రమే చూసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళికి తెలుసు సినిమా అనేది సూపర్ సక్సెస్ అయితే అభిమానులు కూడా వాళ్ళు ఇప్పటి వరకు వేచి చూసిన నిరీక్షణ అంతా మర్చిపోతారు. కాబట్టి ఆయన ఈ సినిమాతో ఒక వండర్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

    దానికోసమే ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కానీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఒక డేట్ ని కనక అనౌన్స్ చేసినట్లయితే అభిమానులు ఆ డేట్ వరకు ఇక మహేష్ బాబును మర్చిపోయి ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అభిమానుల కోరిక మేరకు రాజమౌళి ఈ ఒక్క పని చేస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే దసర రోజు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి రాజమౌళి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.