Prabhas: ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న నటుడు ప్రభాస్…ఆయన క్రేజ్ ను బీట్ చేసే హీరోలు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వరుసగా ఆయన పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సలార్, కల్కి లాంటి రెండు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టడటమే కాకుండా బాక్సాఫీస్ ను ఉచ్చ కోత కోసాడనే చెప్పాలి. ఇక ఇలాంటి ప్రభాస్ ప్రభంజనాన్ని ఆపడం ఏ హీరో వల్ల కావడం లేదు అనేది వాస్తవం. ఇక బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ చరిష్మాను చూసి భయపడి పోతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రభాస్ లాంటి స్టార్ హీరో చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమాలని పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆయన ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఒక యుద్ధ వాతావరణం లో ఆయన సినిమాని చేస్తూ అందులోనే ఒక మంచి లవ్ స్టోరీని కూడా చూపించబోతునట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఒక సీన్ లో చాలా వైల్డ్ గా నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రభాస్ కనికరం లేని ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఒక సీన్ లో తను విలన్ గా మారి కొంతమంది ని చంపే సీన్ చాలా వైల్డ్ గా ఉండడమే కాకుండా చూసే వాళ్లకు సైతం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి సందీప్ రెడ్డి వంగ ఈ సీన్ ను డిజైన్ చేయడానికి గల కారణం ఏంటి? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది అంటూ సందీప్ వంగ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి అంత వైల్డ్ గా ప్రభాస్ ని చూసి జనాలు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ ను చాలా వైలెంట్ గా చూపించి సక్సెస్ ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ ని కూడా అదే రేంజ్ లో చూపించడానికి రెడీ అవుతున్నాడు…