https://oktelugu.com/

Mokshagna Teja: మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లోకి అడుగుపెడుతున్న మోక్షజ్ఞ…డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది..?

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే స్టార్ హీరోలుగా రాణిస్తారు అని చెప్పడానికి ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 10:31 AM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మూడు జనరేషన్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో తమదైన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఒక్కో జనరేషన్ లో ఒక్కో స్టార్ హీరో వస్తు తమ ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ, ఈ సంవత్సరం ఎండింగ్ లో ఆయన సినిమాని స్టార్ట్ చేసి 2025 ఎండింగ్ కల్లా సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ మేకోవర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో స్టార్ హీరోని తలపించే రేంజ్ లో ఆయన ఉన్నాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు ఆచితూచి అడుగులు వేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ కి ఒక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే ఒక భారీ సక్సెస్ ని కూడా సాధింపచేసేలా చేయాలనే కాన్సెప్ట్ తోనే ఎక్కువ కథలను వింటూన్నాడు. ఇక అందులో ఏ కథ అయితే మోక్షజ్ఞ కి బాగుంటుంది అనే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ దాదాపు 15 సినిమాల పైన చేసిన తర్వాత పాన్ ఇండియాలో ఎంట్రీ ఇస్తే మోక్షజ్ఞ మాత్రం మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాను ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘ప్రశాంత్ వర్మ’ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక అది కూడా ఒక ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్ లో స్టోరీని రాసుకొని మోక్షజ్ఞతో చేయించే విధంగా అడుగులు వేస్తున్నారట.ఇక ప్రశాంత్ వర్మ కి పాన్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. కాబట్టి అతను అయితేనే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా బాగుంటుందని బాలయ్య బాబు నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ ‘హనుమాన్ ‘ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

    ఇక ఇప్పుడు వస్తున్న ‘జై హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియాలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞ సినిమాని స్టార్ట్ చేయించి 2025 చివరి కల్లా రిలీజ్ చేయించాలనే ఉద్దేశ్యం లో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కథ చర్చలు కూడా పూర్తయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది…