Namrata Advice To Mahesh Babu: సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు సూపర్ స్టార్స్ అయితే అవ్వరు. సినిమా అవకాశం రావడం వేరు అందులో తమ సత్తా ను చూపించి స్టార్ హీరోగా అవతరించడం వేరు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు తమ టాలెంట్ ని చూపించుకుంటూ స్టార్ డమ్ ను అందుకున్న వాళ్లే కావడం విశేషం…ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ‘వారణాసి’ సినిమాతో తనదైన రీతిలో ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా మహేష్ బాబు కి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక మహేష్ బాబు కి ఒక బ్యాడ్ హాబిట్ అయితే ఉందట.
అది ఇప్పటివరకు ఆయన మార్చుకోవడం లేదంటూ తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని కామెంట్లయితే వ్యక్తం అవుతున్నాయి. నిజానికి అతనికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఎవరైనా తన దగ్గర ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందని చెబితే వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడట.
వాళ్ళకి నిజంగానే అవసరం ఉందా? లేదంటే డబ్బులను వాడుకోవాలనే ఉద్దేశ్యంతో అలా చెప్పారా అనే విషయాలను కూడా పట్టించుకోకుండా తను ఇతరులకు డబ్బులైతే ఇస్తుంటాడని తన స్నేహితులైతే చెబుతుంటారు.
ఇక నమ్రత సైతం ను దగ్గరికి సహాయం కోసం వచ్చే వాళ్ళ అవసరాల తీవ్రతను బట్టి వాళ్ళు జన్యునా కాదా అనే విషయాన్ని తెలుసుకొని సహాయం చేస్తే బాగుంటుందని మహేష్ బాబుకి ఎన్ని సార్లు చెప్పిన కూడా తను ఏది ఆలోచించకుండా డబ్బులైతే ఇచ్చేస్తూ ఉంటాడట. మొత్తానికైతే మహేష్ బాబు కి ఉన్న ఈ బ్యాడ్ హాబిట్ మానుకోవడం లేదంటూ నమ్రత తో పాటు పలువురు మహేష్ బాబు స్నేహితులు కూడా చెబుతూ ఉండడం విశేషం…